సూపర్‌ స్టార్ మహేష్ బాబును తీవ్రంగా కలచి వేసిన సంఘటన ఆయన అమ్మమ్మ మరణం. మహేష్ బాబుకు తల్లితో పాటు అమ్మమ్మతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంది. తన బాల్యం అంతా వారితో గడవటంతో వారి పట్ల ఎంతో ప్రేమగా ఉండే వాడు మహేష్. అయితే మహేష్ బాబు హీరోగా సెటిల్ అవుతుండగా అమ్మమ్మ మరణించటంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆ బాధలో సినిమాల మీద కూడా దృష్టి పెట్టలెకపోయాడు. దీంతో ఆయన కెరీర్‌లో ఏకంగా మూడేళ్ల పాటు బ్రేక్ వచ్చింది.

 

2007 ఆగస్టు 5లో మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మ వయో భారంతో మృతి చెందారు. ఆ సమయంలో మహేష్ బాబు అతిథి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల తరువాత రిలీజ్‌ అయిన అతిథి సినిమా ఫ్లాప్‌ కావటంతో ఆయన మరింతగా డిప్రెస్‌ అయ్యాడు. దీంతో కొంత కాలం సినిమాల మీద కాన్సన్‌ ట్రేట్ చేయలేక పూర్తి సినిమాలను పక్కన పెట్టేశాడు.

 

దీంతో ఆయన కెరీర్‌లో సుధీర్ఘ విరామం వచ్చింది. సాధారణంగా సినిమాలు నెమ్మదిగా పూర్తి చేసే మహేష్, బాధలో ఉండటంతో మరో సినిమా ప్రారంభించడానికి ఏకంగా మూడేళ్ల సమయం తీసుకున్నాడు. అతిథి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహేష్ 2010లో ఖలేజా సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అప్పటికే మానసికంగా దృడంగా తయారు కావటంతో ఖలేజా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆయన తట్టుకొని నిలబడ్డాడు.

 

అమ్మమ్మ మరణం తరువాత మహేష్ వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాల ఎంపికలోనూ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించటం మొదలు పెట్టాడు మహేష్. సూపర్‌ స్టార్ డిప్రెషన్‌లో ఉన్న సమయంలో భార్య నమ్రత మహేష్ వ్యవహారాలను చూసుకోవటం మొదలు పెట్టింది. దీంతో కాస్త ప్రెజర్‌ తగ్గటంతో ఎక్కువగా సినిమాల మీద కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: