అఖిల్.. అక్కినేని నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. 

 

అఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 20 ఏళ్ల యవస్సులోనే తనకంటే నాలుగు ఏళ్లు పెద్దదైన శ్రియా భూపాల్‌ను ప్రేమించిన విషయం తెల్సిందే. చాలా కాలంగా ప్రేమించుకున్న వీరిద్దరు పెళ్లికి కూడా సిద్దం అయ్యారు. అఖిల్‌ - శ్రియల వివాహ నిశ్చితార్థం అయ్యింది. కాని పెళ్లి మాత్రం కాలేదు. ఏం జరిగిందో ఏమో కాని ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. శ్రియ పెళ్లి వేరే వ్యక్తితో అయ్యింది. అఖిల్‌ సినిమాలతో బిజీ అయ్యాడు. ఒక్కో హీరో నాలుగు పదుల వయసు వచ్చినా కూడా పెళ్లికి ఆసక్తి చూపడం లేదు. కాని అఖిల్‌ మాత్రం రెండు పదుల వయసులోనే పెళ్లికి రెడీ అవ్వడం ఆశ్చర్యపర్చింది. ప్రస్తుతం అఖిల్‌ పెళ్లి విషయమై ఎలాంటి ఆలోచన లేదంటున్నాడు. కాని ఇటీవల సినిమా ఇండస్ట్రీలో మాత్రం అఖిల్‌ మళ్లీ ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈయన గతంలో మాదిరిగా మళ్లీ ఒక వ్యాపారవేత్త కూతురుతో డేటింగ్‌లో ఉన్నాడని.. ఇద్దరు కలిసి చాలా చాలా తిరుగుతున్నారు అంటున్నారు. అఖిల్‌ ప్రేమ విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అసలు అక్కినేని అఖిల్‌కు మళ్లీ ప్రేమపైనే ఆసక్తిని కనబర్చడం లేదని.. ప్రస్తుతం అతడికి పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: