అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే... ఈ పదానికి సరిగ్గా సరిపోయే నటి త్రిష. జోడి  సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని  సంపాదించింది. చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపుగా దశాబ్దకాలం దాటిపోతుంది అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి క్రేజ్  తగ్గలేదు. మొదటి నుంచి అందాల ఆరబోతకు దూరంగానే ఉంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. కానీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో  మాత్రం నటిస్తూనే ఉంది. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది త్రిష. అందం అభినయంలో  ఏ హీరోయిన్ కూడా త్రిషకి పోటీ ఇవ్వలేదు అని చెప్పవచ్చు. కేవలం ఆ చిలిపి నవ్వుతోనే ప్రేక్షకుల మతి పోగొడుతోంది త్రిష. 

 

 

 అందం అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ... తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ తన హవాను అనిపిస్తుంది అని చెప్పాలి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పాత్రలకు ప్రాణం పోసి మరి నటించడం స్పెషాలిటీ. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమకు ఒక క్వీన్ గా  ఓ వెలుగు వెలుగుతుంది  త్రిష. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ.. ఎంత అందాల ఆరబోత చేసినప్పటికీ... త్రిష అభినయం అందం నటన ముందు అవన్నీ ప్రేక్షకులకు కనిపించవు అనే చెప్పాలి. టాలీవుడ్ లో  ఎంతోమంది అభిమానులకు అందాల దేవతగా.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న త్రిష ఈ రోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నది . 

 

 

 దీంతో దక్షిణాది చిత్ర పరిశ్రమకు ఒక వెలుగు వెలుగుతున్న త్రిషకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది సినీ ప్రముఖులను త్రిష కు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు తమ అభిమాన నటి అయిన త్రిషకు స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన ఎంతో గుర్తింపు సంపాదించి అటు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ క్వీన్ త్రిష కి ఇండియా హెల్త్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: