తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు తమ ప్రతిభతో రాణించారు. కానీ తెలుగు సినిమాను కమర్షియల్ గా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది మాత్రం దాసరి నారాయణరావు మాత్రమే. పరిశ్రమలో దర్శక దిగ్గజంగా ఎదిగినా ఆయన టచ్ చేయని సబ్జెక్టు లేదు. జోనర్ ఏదైనా దర్శకత్వ విభాగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. దర్శకులందరికీ ‘గురువు గారు’ గా ఎదిగారు. ఎందరో దర్శకులు ఆయన శిష్యరికం చేసి ఎదిగిన వారే. నేడు ఆయన 73వ జయంతి. కమెడియన్ రాజబాబును హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడిగా 1972లో తాత-మనవడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

IHG

 

తొలి సినిమానే 25వారాలు రన్ కావడం.. అక్కడి నుంచి ఆయన దర్శక సృష్టి దిగ్విజయంగా కొనసాగడం ఓ చరిత్ర. దర్శకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చి ప్రతి దర్శకుడికి కేరాఫ్ అడ్రస్ లా నిలిచారు. ఓ దశలో ఆయన వరుసగా 8 సినిమాలను సూపర్ హిట్లు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి జనరేషన్ హీరోలందరితో ఆయన సినిమాలు తీశారు. ఎమ్మెల్యే ఏడుకొండలు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మేఘసందేశం, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ.. వంటి అద్భుతాలెన్నో తీశారు. నటుడిగా మామగారు, సూరిగాడు వంటి సినిమాలు ఆయనకు కీర్తి కిరీటాలు. రచయితగా కూడా వందలాది సినిమాలకు పనిచేశారు.

IHG

 

దర్శకుడిగా దాసరికి 15వేలకు పైగా అభిమాన సంఘాలుండేవంటే ఆయన ప్రభంజనం ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మోహన్ బాబుతో సహా ఎంతోమంది నటులను సినీమాల్లో పరిచయం చేశారు. దర్వకులు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు ఆయన శిష్యులే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. తెలుగు సినిమా మెడలో ఆయన ఓ మణిహారం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: