ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మరో ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల మరోసారి మనసులకి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడు. హ్యాపీడేస్ నుండి మొదలుకుని ఆనంద్, గోదావరి వరకూ శేఖర్ కమ్ముల టచ్ చేసిన ప్రేమకథలన్నీ సున్నితమైనవే. సున్నితమైన భావోద్వేగాల్ని అందంగా చెప్పడం శేఖర్ కమ్ముల స్టైల్.

 

 

అయితే ప్రతీ ప్రేమకథలోనూ హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు శేఖర్ కమ్ముల, ఆనంద్ సినిమా పేరు మాత్రమే హీరోది.. అంతే తప్ప సినిమా మొత్తం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. అలాగే గోదావరి.. ఈ సినిమాలోనూ హీరోయిన్ కమిలినీ ముఖర్జీదే డామినేషన్.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మొన్న వచ్చిన ఫిదా వరకూ ప్రతీ దానిలో హీరోయిన్ల హవానే ఎక్కువ ఉంటుంది.

 


అయితే ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీలోనూ హీరోయిన్ సాయిపల్లవిదే డామినేషన్ ఉంటుందేమో అన్న అనుమానం మొదలైంది.ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంత యువకుడిగా కనిపించనున్నాడట. అందుకోసం తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకున్నాడట. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు చదువుల కోసం పట్టణానికి వచ్చి ప్రేమలో పడటమే సినిమా కథాంశం అని చెప్పుకుంటున్నారు.

 

 

అయితే ఈ సినిమాలో సాయిపల్లవిదే డామినేషన్ ఉంటుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా బలంగా ఉంటాయట. ఇద్దరికీ సమానంగా స్క్రీన్ స్పేస్ ఉండడంతో పాటు, ఒకరిని ఎక్కువ చేసి, మరొకరిని తక్కువ చేసి చూపించలేదట.  డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: