ఒక‌ప్పుడు తెలుగులో తల్లి, వ‌దిన‌, అత్త పాత్ర‌లు వేయాలంటే సుధ బాగా పాపుల‌ర్‌. సుధ ఎన్నో సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌కు సైతం అక్క‌గా, వ‌దిన‌గా, అత్త‌గా న‌టించింది. ఆ త‌ర్వాత ఇప్పుడు ఆ ప్లేసుల్లోకి ప‌విత్ర‌, ప్ర‌గ‌తి దూసుకు వ‌చ్చేశారు. ప్ర‌గ‌తి అయితే ఈ వ‌య‌స్సులో కూడా న‌ట‌నా ప‌రంగా దూసుకు పోతోంది. ఎఫ్ 2 సినిమాలో ఇద్ద‌రు హాట్ హీరోయిన్ల త‌ల్లిగా ఆమె చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.  ఇటీవల ప్రగతి తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో కూడా ప్రగతి ఆంటీ తన ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

 

సోష‌ల్ మీడియాలో ఆమెకు ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే అందమైన ఫోటోలకు ఆమె అభిమానులు లైకులు కామెంట్లు లతో హోరెత్తిస్తుంటారు.  44 ఏళ్ల వయసులో కూడా ప్రగతి యోగాసనాలు వేస్తూ ఆ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే ఆమె ఫిట్నెస్ రహస్యం ఏంటో అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో శృంగార కోరికలు తీర్చాలన్న వార్తలను మనం రెండేళ్లుగా వింటున్నాం... చూస్తున్నాం.

 

ఈ క్ర‌మంలోనే ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న‌కు జ‌రిగిన ఓ చేదు అనుభ‌వం వివరించింది. ఓ సినిమా షూటింగ్ టైంలో ఓ క‌మెడియ‌న్ త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాడ‌ని... సెట్‌లో చాలా ఇబ్బంది పెట్ట‌డంతో పాటు కేరోవేన్ లోకి తీసుకు వెళ్లి మీ ప్ర‌వ‌ర్త‌న చాలా ఇబ్బందిగా ఉంద‌ని వార్నింగ్ ఇచ్చాన‌ని ప్ర‌గ‌తి చెప్పింది. ఆ త‌ర్వాత అత‌డు సైలెంట్ అయినా.. మిగిలిన వారి ద‌గ్గ‌ర మాత్రం నాకు చాలా పొగ‌రు... అహంకారం అని ప్ర‌చారం చేశాడ‌ని ఆమె వాపోయింది. ఇంత‌కు ఆ క‌మెడియ‌న్ ఎవ‌రు ? అన్న‌ది మాత్రం ఆమె చెప్ప‌లేదు.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: