కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లోని ఓ పేదల కాలనీ లో ఓ వ్యక్తి గోదుమ పిండి ముద్దల్లో డబ్బు పెట్టి పంచినట్టుగా వార్తలు వినిపించాయి. కాలనీ అవసరం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు కేవలం ఒక కేజీ పిండి పంచుతున్నట్టుగా చెప్పారు. ఆ కేజీనే తీసుకునేందుకు వచ్చిన వారికి పిండి ముద్దల్లోనే 15 వేల రూపాయల డబ్బు పెట్టి పంచినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ డబ్బు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌, హీరో ఆమిర్‌ ఖాన్‌ పంచి పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలతో ఆమిర్ అభిమానులు పండగ చేసుకున్నారు.

 

ప్రస్తుతం కరోనా కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, సినీ తారలు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. చాలా మంది తారలు తమ వంతుగా ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తుంటే, మరికొందరు ప్రత్యక్షంగా తామే సాయం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పిండి ముద్దలో డబ్బు పంచారన్న వార్త వైరల్‌ అయ్యింది.

 

అయితే ఈ వార్తల పై ఆమిర్‌ ఖాన్‌ స్పందించాడు. గోదుమ పిండి లో డబ్బు పెట్టి అందచేసింది నేను కాదు అంటూ క్లారిటీ ఆమిర్‌ ఖాన్‌. అంతే కాదు ఆ వార్తలు పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ అయినా అయి ఉంటాయి లేదా.. తన పేరు బయటకు చెప్పటం ఇష్టం లేని  రాబిన్‌ హుడ్ లాంటి మంచి వ్యక్తి ఎవరైనా సాయం చేసి ఉంటాడు. అంటూ తన ట్విటర్‌ పేజ్‌ ద్వారా క్లారిటీ ఇచ్చాడు ఆమిర్‌ ఖాన్. అయితే కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ బాలీవుడ్ తారలు తమ వంతు సాయం చేస్తుండగా ఆమిర్ ఖాన్ మాత్రం ఇంత వరకు తాన సాయాన్న ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: