టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల వారసులు వెండి తెరకు పరిచయం అయ్యారు. అలాంటి వారిలో మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు వచ్చారు. నందమూరి, అక్కినేని, మంచు, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఉన్నారు.  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా పరిచయం అయినా... ప్రస్తుతం మహేష్ బాబు స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు.  కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో.. ఆయన అల్లుడు సుధీర్ బాబు.  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జోడిగా నటించిన ‘ఏం మాయ చేసావే’ మూవీలో సమంత సోదరుడిగా నటించాడు. ఆ తర్వాత SMS (శివ మనసులో శృతి) మూవీలో హీరోగా నటించాడు.  

 

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథాచిత్రమ్’ మంచి సక్సెస్ సాధించింది.  ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు సుదీర్ బాబు. బాలీవుడ్ లో బాగీ మూవీతో విలన్ గా అడుగు పెట్టాడు... కానీ అక్కడ కూడా సక్సెస్ సాధించలేకపోయాడు.  దాంతో ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ కి రెడీ అయ్యారు. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు మల్టీస్టారర్ మూవీ ‘వి’ రిలీజ్ కి సిద్దంగా ఉంది.  స్వతహాగా బ్యాట్ మెంటన్ అయిన సుదీర్ బాబు మార్షల్ ఆర్ట్స్, జమ్నాస్టిక్ లో మంచి ప్రావీణ్యం ఉంది.

 

అంతే కాదు ఈ మద్య యోగాసనాలతో జనాలను ఆశ్చర్యపరుస్తున్నారు.  ఆ మద్య గాల్లో పద్మాసనం వేసిన నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను ట్వీట్ చేసిన సుధీర్‌, `నన్ను నమ్మండి.. గ్రాఫిక్స్‌ చేయలేదు` అంటూ కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన సుధీర్ బాబు ఇంట్లో అనేక విన్యాసాలు చేస్తున్నాడు . త‌న ఫిట్‌నెస్ కోసం అప్పుడ‌ప్పుడు స్టంట్ వీడియోలు చేస్తూ వ‌స్తున్న సుధీర్ బాబు తాజాగా గాల్లోకి ఎగిరి రెండు కాళ్ల‌ని ప‌ట్టుకున్నాడు. ఇది చూసిన నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెట్టారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: