టాలీవుడ్ లో ఇప్పుడు ప్రేక్షకులు అందరూ కూడా ఒక మంచి సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. టాలీవుడ్ లో గాని ఇండియన్ సినిమాలో గాని ప్రపంచ వ్యాప్తంగా గాని ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు. దీని తో చాలా మంది ఒక్క మంచి సినిమా వస్తే చాలు అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఒక సినిమా గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి నటించిన ఒక సినిమాను గతంలో షూటింగ్ పూర్తి చేసి పక్కన పెట్టారట. 

 

ఆ సినిమాను ఇప్పుడు విడుదల చెయ్యాలి అని చూస్తున్నారట. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది అని ఆ షూటింగ్ కి సంబంధించి అప్పుడు కొన్ని గొడవలు కావడం తో సినిమాను విడుదల చేయకుండా ఆపేశారు అని ఇప్పుడు దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. ఆమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సదరు నిర్మాతతో చర్చలు జరిపిన చిరంజీవి విడుదల చేద్దామని అడిగినట్టు సమాచారం. 

 

దీనికి సదరు నిర్మాత కూడా ఓకే చెప్పారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆ సినిమాలో చిరంజీవి ఒక రౌడీ గా నటించారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమా ఎడిటింగ్ కొంత ఉంది అని అది పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. మరి విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ఆ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటించారు అని తెలుస్తుంది. మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: