ఆర్ఆర్ఆర్సినిమా గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చలు అన్నీ ఇన్ని కావు. ప్రతీ ఒక్కరు కూడా ఈ సినియా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా విడుదల చాలా మందికి ఒక పండగా కూడా అనేది అనేది వాస్తవం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. వాటిని మార్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 

 

ఇప్పుడు ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలను మార్చాలి అని కూడా కొందరు కోరుతున్నారు. అవి సినిమాకు ఇబ్బంది గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతు౦ది. అయితే అది కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కథ బాగా మార్చే అవకాశం ఉందని క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేయడానికి దాదాపు ఏడు నెలలు పట్టే అవకాశం ఉంది అని అందుకే ఈ సినిమాను వాయిదా వేసే అవకాశం ఉంది అని అంటున్నారు. జక్కన్న ఇప్పటికే దీనికి సంబంధించిన పని కూడా మొదలుపెట్టారు అని సమాచారం. 

 

ఈసినిమాలో కొన్ని సన్నివేశాలను మార్చాలి అని హీరోలు ఇద్దరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అని అందుకే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన చర్చలు నిర్మాతకు దర్శకుడికి మధ్య జరుగుతున్నాయి అని దర్శకుడు ఓకే అంటే దాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా వాయిదా పడితే మాత్రం చాలా మందికి ఒకరకంగా పైకి చెప్పుకోలేని ఇబ్బంది అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: