తెలుగు బుల్లి తెర మీద మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమా. ఆమెకు మంచి గుర్తింపు బుల్లి తెర మీద వచ్చింది. అయితే ఆమె సినిమాలకు మాత్రం చాలా దూరంగా ఉంది ఈ మధ్య కాలంలో అయినా ముందు నుంచి అయినా సరే. ఆమెకు మంచి పాత్ర ఇచ్చే అవకాశం ఉన్నా సరే ఆమె మాత్రం సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఏ విధంగా కథలో ఆమెకు ప్రాధాన్యత ఇచ్చినా సరే ఆమె మాత్రం సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఆమె తెలుగులో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

 

ఇప్పుడు ఆమె ఒక సినిమాను మహేష్ బాబు హీరోగా చేసే అవకాశం ఉంది అని సమాచారం. మహేష్ బాబు కి అక్కగా ఆమె నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించి ఒక ప్లాన్ చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పరుశురాం దర్శకత్వంలో ఆమె  ఈ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో  మహేష్ బాబు కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమాలో కూడా ఆమెకు కీలక పాత్ర వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. 

 

ఆమె సినిమాలకు మరింత దగ్గరి యాంకర్ గా దూరం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సుమా ప్రస్తుతం షోస్ తగ్గించింది అనేది అంటున్నారు. ఆమె చేసే ఎలాంటి పాత్రలు చెయ్యాలి అనుకుంటుంది అనేది ఎవరికి ఇంకా స్పష్టత లేదు. కాని ఆమె మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలను చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలను సుమా చేస్తున్నారని అందుకే ఇప్పుడు అలాంటి మంచి పాత్రల మీద దృష్టి పెట్టింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: