జూనియర్ ఎన్టీయార్ 18 ఏళ్ళకే టాప్ హిట్ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాదే సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి అప్పటి సీనియర్ హీరోలను డైలామాలో పడేసాడు. చిన్న వయసులోనే హీరో అవడమే కాదు, హిట్లు కూడా అప్పటి నుంచే ఇస్తూ గత రెండు దశాబ్ద్దాలుగా జూనియర్ ఎన్టీయార్ సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నాడు.

 

ఇక మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన రాం చరణ్ మొదటి సినిమా చిరుతతోనే దుమ్ము లేపాడు. ఆ తరువాత మగ‌ధీర మూవీతో ఇండస్ట్రీ  హిట్ కొట్టాడు. రెండేళ్ళ క్రితం వచ్చిన రంగస్థలం మూవీతో తనేంటో ప్రూవ్ చేసుకోవడమే కాకుండా నటనలో ఒక్కసారిగా పదడులు పైకి ఎక్కేశాడు. చెర్రీ ప్రతి సినిమాల్లో డైలాగ్ మాడ్యులేషన్ లో కానీ, నటనలో కానీ తనను తాను మెరుగుపరచుకుంటూ మెగాస్టార్ కి అసలైన వారసుడు అనిపించుకున్నాడు.

 

ఇపుడు ఈ ఇద్దరు హీరోలు కలసి ఒక మూవీ చేస్తున్నారు.అదే  ఆర్ ఆర్ ఆర్ మూవీ. ఈ మూవీ ఓ విధంగా రాజమౌళీకి ఒక సవాల్, హిట్ ఎపుడూ రాజమౌళి వళ్ళోనే ఉంటుంది కనీ ఇద్దరు టాప్ హీరోస్. ఇండస్ట్రీ కొన్ని దశాబ్దాలుగా మరచిపోయిన మల్టీ స్టారర్ మూవీని టేక‌ప్ చేయడం అంటే రిస్కే.

 

మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కి ఢీ అంటే ఢీ అన్నట్లుగా బయట ఉంటుంది. హీరోలు ఎంత మంచిగా ఉన్నా కూడా  ఫ్యాన్స్ మాత్రం మా హీరోవే గొప్ప అనుకుంటారు. అటువంటి సిట్యువేషన్స్ లో రాజమౌళి ఇద్దరికి సమానంగా స్క్రీన్ షేర్ ఇవ్వకపోతే చాలా పెద్ద రగడ అవుతుంది.  దాంతో ఈ సినిమా కధా రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ ఇద్దరికీ సమానంగానే కధను పంచారట. అలాగే రాజమౌళి కూడా ఒక సెకన్ అటూ ఇటూ కాకుండా ఇద్దరికీ స్ర్కీన్ షేర్ చేశాడట. 

 

ఈ విషయం ఇపుడు రివీల్ కావడంతో  మెగాభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారుట. ఈ మూవీని ఎంత తొందరగా చూద్దామా అని ఎదురుచూస్తున్నారుట. సో అంతా వెయిటింగ్ ఇక్కడ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: