విషాదం ఎక్కడో ఉండదు, ప్రతీ తెలుపు వెనకాల నలుపు ఉన్నట్లే ప్రతీ జీవితంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ఆ జీవితాన్ని నలిపేస్తుంది. అయితే ఆ కష్టాలను తట్టుకుని పైకి వచ్చిన వారే గొప్పవారు అవుతారు. విషాదాలు కలకాలం గూడు కట్టుకుని ఉండిపోవు. అందువల్ల వాటిని ఎదిరించి నిలవాలి.

 

ఇదంతా ఎందుకంటే ఆలా నిలిచి విషాదాన్ని ఎదిరించింది ఐశ్వర్యా రాజేష్. ఆమె ఎవరో కాదు ఆనందభైరవి మూవీలో హీరో రాజేష్ కూతురు. రాజేష్ అందాల నటుడు, కేవలం తన వ్యసనాలతో  40 ఏళ్ల లోపే తనువు చాలించాడు. అతనికి ముగ్గురు పిల్లలు.  ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అంటే ఐశ్వర్యకు ఇద్దరు అన్నయ్యలు అన్నమాట.

 

ఇక ఉన్న డబ్బు అంతా పోగా రాజేష్ భార్య ముగ్గురు పిల్లలను అద్దె ఇంట్లొ ఉంటూ చదివించింది. ఇక మంచి ఉద్యోగం చేస్తున్న రాజేష్ ఇద్దరు కొడుకులు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారుట. అంటే ఐశ్వర్య చిన్నతనంలోనే తండ్రిని, ఆ తరువాత అన్నలను కూడా కోల్పోయిందిన్నమాట. ఇక కుటుంబం పోషణ తన మీద పడడంతో చిన్నతనం నుంచే కెమెరా ముందుకు వచ్చింది.

 

తమిళనాడులోని సన్ టీవీలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య ఆ తరువాత ఎంతో పట్టుదలతో హీరోయిన్ అయింది. ఆమె నల్లగా ఉందని అప్పట్లో ఎగతాళీ చేసేవారట. నీ ముఖం చూసుకోమని కూడా హేళన చేసేవారట. అయినా సరే వాటిని దిగమింగుకుని ఇప్పటికి మంచి నటిగా నిలిచింది. ఐశ్వర్య తండ్రి పేరు నిలబెడుతూ మంచి నటీమణి అనిపించుకుంది. 

 

ఇంతకీ ఆమె మేనత్త కూడా మనకు పరిచయమే. ఆమె ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి. ఇక ఐశ్వర్య తాత అమరనాధ్ మంచి నటుడు. ఆయన తెలుగు, తమిళ సినిమాల్లో వందల చిత్రాలు చేశారు. మొత్తానికి ఐశ్వర్య విషాదాన్ని జయించి తన కుటుంబానికి అసలైన ఐశ్వర్యంగా వెలుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: