భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

 

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

 

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం(HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

 

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: