టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే రేణుదేశాయ్ కి వచ్చిన గుర్తింపు మాత్రం ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు ఉండే కొన్ని పరిచయాలు ఆమె చేసుకున్న రెండో పెళ్లి అన్నీ కూడా సంచలనమే. ఆమె ఇప్పుడు సినిమాలకు దగ్గరగానే ఉన్నా వరుసగా సినిమాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు అనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రెండో భార్య గా రేను దేశాయ్ ఇప్పుడు జనాలకు పరిచయం అయ్యారు. ఆమె హీరోయిన్ గా కంటే ఇలాగే ఎక్కువగా జనాలకు పరిచయం అనే సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఆమె సినిమాలను వరుసగా చేయడానికి గానూ తీవ్రంగా కష్టపడుతున్నారు. చిన్న చిన్న సినిమాల మీద కూడా ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు ఒక పాత్ర దక్కే అవకాశం ఉందని సమాచారం. చిన్న పాత్ర ఆయన సినిమాలో వచ్చినా చాలు అనుకునే విధంగా ఆమె ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఒక సినిమాను మహేష్ బాబు హీరో గా మహేష్ కి తల్లి గా చేస్తున్నారు అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు మాజీ హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఆమెకు మంచి పాత్ర వచ్చినా చాలు అనుకునే విధంగా ఉన్నారట. వరుసగా సినిమాలు చేయడానికి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది అని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. చిన్న చిన్న హీరోలకు తల్లి గా కూడా నటించాలి అని ఆమె భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు దర్శకులతో చర్చలుకుడా ఆమె జరిపారు అని అంటున్నారు. తన కొడుకు హీరోగా  రామ్ చరణ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో ఆమె ఒక మంచి పాత్ర చేసే ఆలోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. మరి చేస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: