రంగస్థల౦ సినిమా తర్వాత యాంకర్ అనసూయ కు వచ్చిన గుర్తింపు గురించి అందరికి తెలిసిందే. అనసూయ చేసిన ఆ సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా వచ్చిన ఆ సినిమా చూసిన వాళ్ళు అనసూయ పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునే విధంగా ఆమె నటించింది అనేది వాస్తవం. ఆమె చేసిన ఆ పాత్ర ఒక సంచలనమే. ఆమె పండించిన ఎమోషన్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె నటించి మెప్పించింది. 

 

ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రతీ సీన్ లో కూడా ఆమె బాగా నటించి౦ది. ఇప్పుడు పుష్పా సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్రను ఇచ్చే ఆలోచనలో సుకుమార్ ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పుష్పా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఆమెకు ఇచ్చే పాత్ర గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ చేస్తున్నట్టు సమాచారం. అనసూయ ను ఆ పాత్ర కోసం సుకుమార్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది, ఆమె ఏ విధంగా నటించాలి అనే దాని మీద ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాడు అని సమాచారం. 

 

బరువు కూడా పెరగాలి అని ఆమెకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె ముఖం మీద  కత్తి ఘాటు కూడా ఉంటుంది అని సమాచారం. ఆమె ఆ విధంగా ఈ సినిమాలో నటిస్తారు అని అంటున్నారు. ఆమె రెండు మూడు నెలలు జైలు లో కూడా ఉండే విధంగా సినిమాలో కథ ఉంటుంది అని టాక్. మరి ఆమె ఏ విధంగా అలా నటిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా కథకు తుది మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: