సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో జేడీ చక్రవర్తి మాట విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైగా ఆయన మనస్తత్వం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ప్రేక్షకులకు కూడా సరిగా అర్థం కాదు. చాలావరకు ఆయన మాటలు విని పొగరా, పిచ్చితనమ, మెంటలా ఏమైనా ఉందా ? లేకపోతే అజ్ఞానంగా మాట్లాడుతున్నాడా అన్న విధంగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా మరియు క్యారెక్టర్ సపోర్ట్ ఆర్టిస్ట్ గా రాణించిన జె.డి.చక్రవర్తి తాజాగా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పై లెటర్ రాస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు విని చాలా మంది నెటిజన్లు చిరంజీవి ని ఏంటి అలా అనేసాడు మనసులో మాటేనా ? జె.డి.చక్రవర్తి చెప్పింది అని అంటున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ వచ్చిన నేపథ్యంలో  సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకున్న కార్మికులను ఆదుకోవటానికి చిరంజీవి చారిటీ పెట్టిన విషయం అందరికీ తెలిసినదే. పెట్టిన ఈ చారిటీకి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు చాలామంది విరాళాలు ప్రకటించడం జరిగింది. దీంతో చిరంజీవి మొత్తం వచ్చిన విరాళాలను సేకరించి ఇండస్ట్రీ ని నమ్ముకున్న సినిమా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఇటీవల మనకందరికీ తెలిసినదే.

 

దీంతో జె.డి.చక్రవర్తి చిరంజీవి గారు ‘నువ్వు అన్న నీ నటన అన్న నాకు చాలా ఇష్టమే కానీ అభిమానిని కాదు నిన్ను మెగాస్టార్ లా కాకుండా ఒక సామాన్య నటుడిలా గానే చూశాను...' కానీ అంతకు మించి మీలో నిజమైన మనిషి నీ ప్రస్తుతం  చూస్తున్నాను అని లెటర్ రాయడం జరిగింది. చాలా జెంటిల్ గా జేడీ చక్రవర్తి చిరంజీవి పై చెప్పిన గాని...కొంచెం వాడిన భాష ఘాటుగా ఉండటంతో నెటిజన్ల అంతా షాక్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: