రీ ఎంట్రీ తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలతోనే కాదు కొత్త ఆలోచనలతో సర్ ప్రయిజ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవిసినిమా తర్వాత ముగ్గురు యువ దర్శకులతో సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. అందులో సాహి సుజిత్ తో పాటుగా కె.ఎస్ రవీంద్ర, మెహెర్ రమేష్ కూడా ఉన్నారు. సుజిత్, రవీంద్రలతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేసినా మెహెర్ రమేష్ తో సినిమా అనగానే షాక్ అయ్యారు. 

 

ఆ డైరక్టర్ సినిమా చేస్తే భారీ తనంతో ఉండటమే కాదు ఆఫ్టర్ రిలీజ్ భారీ లాసులు కూడా ఉండటం కామన్. కంత్రి యావరేజ్, బిల్లా సక్సెస్ అందుకున్న మెహెర్ రమేష్ స్టార్స్ కూడా డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. ఈమధ్య మళ్ళీ వార్తల్లోకి వచ్చిన మెహెర్ రమేష్ మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. సీసీసీ తరపున యాక్టివ్ గా ఉన్న మెహెర్ రమేష్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు చిరు. అయితే రమేష్ తో డైరెక్ట్ మూవీ కన్నా ఒక రీమేక్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. 

 

ఫ్యాన్స్ కూడా మెహెర్ రమేష్ తో రీమేక్ అయితే ప్రాబ్లమ్ ఉండదని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అందుకే మెహెర్ రమేష్ కు రీమేక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్. అయితే సుజిత్ తో ఆల్రెడీ లూసిఫర్ రీమేక్ చేస్తున్న చిరు మెహెర్ రమేష్ కోసం ఏ సినిమా రీమేక్ చేస్తారో చూడాలి. చిరు ఇచ్చిన ఈ మెగా ఛాన్స్ వాడుకుని మెహెర్ రమేష్ హిట్టు కొడితే మాత్రం మళ్ళీ డైరక్టర్ గా అతను ట్రాక్ ఎక్కినట్టే. చిరుతో మెహెర్ రమేష్ సీనియా ఎలా ఉండబోతుంది. ఏ భాషలోని సినిమా రీమేక్ చేస్తున్నారు అన్న విషయాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: