టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ముందుగా నువ్విలా సినిమా ద్వారా క్యారెక్టర్ ఆరిస్ట్ గా అక్కడక్కడా చిన్న పాత్రలతో సినిమా రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో తన పాత్రల్లోని నటన ద్వారా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న విజయ్, అనంతరం తన మిత్రుడు తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారడం జరిగింది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్నిఆ అందుకోవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు అతి పెద్ద విజయాలు అందుకుని విజయ్ ని అతి పెద్ద స్టార్ ని చేసాయి. 
ఇక ఇటీవల కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

 

ఇకపోతే కొన్నాళ్లుగా ప్రపంచదేశాలన్నిటినీ కూడా ఎంతో కుదిపేస్తున్న కరోనా ఎఫెక్ట్ తో ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా పూర్తిగా కొన్నాళ్ల నుండి లాక్ డౌన్ చేయడంతో దిగువ వర్గాల వారు పనులు లేక, తినడానికి తిండి కూడా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి వారికి ప్రభుత్వాలు సాయం అందిస్తున్నప్పటికీ, మేము కూడాసాయపడతాం అంటూ ఇప్పటికే పలు రంగాలకు చెందిన అనేకమంది ముందుకు రావడం జరిగింది. అలానే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఎందరో సినిమా ప్రముఖులు ముందుకొచ్చి విరివిగా విరాళాలు అందించారు. అయితే ఇటీవల తనవంతుగా కొంత మొత్తం విరాళాన్ని కరోనా బాధితలకు ప్రకటించిన విజయ్ దేవరకొండ, తన పేరిట ఒక టీమ్ గా ఏర్పడి ఒక ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి ఎందరో అభాగ్యులకు తనవంతుగా సాయాన్ని అందిస్తూ మంచి మనసున్న హీరోగా చాటుకుంటున్నారు. 

 

కాగా ఆయన ఫౌండేషన్, ప్రజల నుండి విరాళాలు అందిస్తూ వాటిని ఎంతవరకు ఖర్చు చేస్తోంది, విజయ్ ఇచ్చిన విరాళాల లెక్కలు చెప్పాలి అంటూ ఒక ప్రముఖ వెబ్ సైట్ రెండు రోజులుగా పలు ఆర్టికల్స్ రాస్తుండడంతో, అటువంటివి తన దృష్టికి వచ్చి ఎంతో మనోవేదనను కలిగించాయని, వాటిపై వివరణ ఇస్తూ విజయ్ దేవరకొండ ఒక వీడియో రిలీజ్ చేయగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కాసేపటి క్రితం నేను సైతం అంటూ విజయ్ కు మద్దతుగా నిలిచి, ఇటువంటి తప్పుడు రాతలను మనం అందరం కలిసి తరిమి కొట్టాలి, ఓవైపు మన భార్యలకు భర్తగా, తల్లికి బిడ్డగా, అలానే మరోవైపు తమ వృత్తిలో ఎంతో కష్టపడుతూ ప్రేక్షకుల, అభిమానుల మెప్పు పొందిన మన గురించి ఈ విధంగా తప్పుడు వార్తలు రాయడం దారుణం, ఈ విషయమై నేను నీకు తోడుగా ఉంటాను అంటూ మహేష్, విజయ్ పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ సంచలన పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. కాగా మహేష్ తోపాటు మరికొందరు సినిమా ప్రముఖులు సైతం ఈ విషయమై విజయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: