అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది. పుష్ప సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సుకుమార్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసందే. ఆ తర్వాత తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పుడు సుకుమార్ పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుంది కాబట్టి 2021 సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆ బరిలో దిగడానికి కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సంక్రాంతికే రిలీజ్ కానుందని తాజా సమాచారం. లాక్ డౌన్ నేపథ్యంలోనే ఈ సంవత్సరం రిలీజవ్వాల్సిన సినిమాలు సంక్రాంతి కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

 

ఇక ప్రభాస్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ సినిమా, వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నారప్ప ..సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజయ్యో అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే అప్పటికి పుష్ప మాత్రం కంప్లీటవదని సమ్మర్ స్పెషల్ గా సిద్దం అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఎక్కువ భాగం ఫారెస్ట్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు దేవీశ్రీ సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఎప్పటిలాగే దేవీ శ్రీ ప్రసాద్ మాంచి ఐటం సాంగ్ ని రెడీ చేస్తున్నారని ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: