టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి, అలానే ఆయన నటించిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనాలి. తన కెరీర్ లో దాదాపుగా 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ, ఎన్నో మరపురాని అద్భుత  పాత్రలతో ప్రేక్షకులను అభిమానులను మెప్పించి గొప్ప విజయాలను అందుకున్నారు. ఇక ఆయన కెరీర్లో 1986 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ సినిమా సింహాసనం. అప్పట్లో తొలి 70 ఎంఎం సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింహాసనం అందుకున్న విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

 

ముందుగా ఎప్పటి నుంచో ఒక భారీ జానపద సినిమాలో నటించాలని అప్పట్లో భావిస్తున్న కృష్ణ, హఠాత్తుగా ఒక రోజున సింహాసనం అనే భారీ ప్రాజెక్టు చేస్తున్నట్లుగా పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. అనుకున్నదే తడవుగా తన సొంత సంస్థ అయిన పద్మాలయా పై దాదాపుగా మూడున్నర కోట్ల కానీ వినీ ఎరుగని భారీ బడ్జెట్ తో సింహాసనం సినిమాని నిర్మించారు కృష్ణ. వి ఎస్ ఆర్ స్వామి కెమెరామెన్ గా పనిచేసిన ఈ సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ కూడా కృష్ణ కావడం విశేషం. ఇక రిలీజ్ రోజున అప్పట్లో 150కి పైగా థియేటర్లలో మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, సూపర్ డూపర్ హిట్ సాధించడంతోపాటు 40 కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. 

 

మొత్తంగా నాలుగున్నర కోట్లకు పైగా ఓవరాల్ గా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, వైజాగ్ చిత్రాలయ థియేటర్లో వంద రోజులు పాటు అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం విశేషం అని, అలానే ఆపై జులై లో చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా శతదినోత్సవ వేడుకలకు అప్పటి తమిళనాడు ప్రభుత్వం నివ్వెరపోయేలా వేలాదిగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు 400 లకు పైగా బస్సుల్లో చెన్నై కి తరలి రావడం జరిగిందట. మొత్తంగా చెప్పాలంటే అప్పట్లో సింహాసనం సినిమా సాధించిన విజయం ఇప్పటికీ కూడా ప్రేక్షకుల మదిలో నిలిచి ఉందని, ఈ విధంగా అత్యద్భుత విజయాన్ని అందుకున్న సింహాసనం సృష్టించిన చరిత్ర, ప్రభంజనాన్ని ఎప్పటికీ కూడా ప్రేక్షకులు, అభిమానులు మరిచిపోలేని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: