తెలుగు సినిమా తెర మీదకు ఓ సామాన్యుడి  లా వచ్చి అసామాన్యుడి  లా ఎదిగిన టాప్ స్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్‌ ఇప్పుడు తానే తెలుగు సినిమాకు వెన్నుదన్నుగా మారాడు. తెలుగు సినిమాకు పర్యాయపదం గా మారిన చిరంజీవి కి ఇండస్ట్రీ లో మొదటగా ఇచ్చిన ట్యాగ్ సుప్రీం హీరో . చిరు యూత్‌ లో ఉండగా ఎక్కువగా మాస్‌ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసే వాడు. పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండ కమర్షియల్‌ మూస లో సినిమాలు చేసేవాడు .

 

అయితే ఆ సమయంలో చిరును అంతా సుప్రీం హీరో అని కీర్తించేవారు. అప్పటి వరకు తెలుగు సినిమా ప్రయాణిస్తున్న ట్రెండ్‌ కు భిన్నంగా కొత్త తరహా సినిమా స్టైల్‌ ను పరిచయం చేసిన చిరు తనకంటూ సపరేట్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు . అందుకే చిరంజీవి ఇండియన్‌ స్క్రీన్ మీదే బిగ్గెస్ట్ స్టార్ అనిపించుకునే స్థాయికి ఎదగ గలిగాడు. ఆ సమయంలో సుప్రీం హీరో మెగాస్టార్‌ గా మారాడు.

 

చిరును తొలిసారి గా మెగాస్టార్‌ అని కీర్తించిన సినిమా మరణమృదంగం . 1988లో రిలీజ్‌ అయిన ఈ సినిమా టైటిల్స్‌ లో తొలిసారిగా చిరు పేరుకు ముందుకు మెగాస్టార్ అనే టైటిల్‌ ను యాడ్‌ చేశారు . క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్‌ లో తెరకెక్కిన ఈ సినిమాకు చిరుకు వరుస బ్లాక్ బస్టర్స్‌ అంధించిన ఏ కొదంట రామి రెడ్డి దర్శకుడు . ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కథ స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మెగాస్టార్‌ గా చిరు పేరును సార్థకం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: