టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఫాన్స్ చేసే హడావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆయన కెరీర్ లో చాలా రోజులు సరైన హిట్ అనేది అనే మాట అక్షరాలా నిజం. పవన్ కళ్యాణ్ ఒక్క హిట్ కోసం తీవ్రంగా కష్టపడిన రోజులు ఉన్నాయి అనేది చాలా మందికి తెలుసు. ఈ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

 

పవన్ ఒక్క హిట్ వస్తే చాలు అనుకునే సమయంలో వచ్చిన ఆ విజయం ఆయన్ను స్టార్ హీరోగా నిలబెట్టింది అనేది వాస్తవం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకూ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమా తర్వాత పవన్ వరుసగా సినిమాలు చేసారు. మళ్ళీ ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. జల్సా సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన అతి తక్కువ హిట్స్ లో ఒకటి. ఆ సినిమా వసూళ్లు కూడా అప్పట్లో బాగానే వచ్చాయి. ఆ విధంగా పవన్ కి జల్సా మంచి హిట్ ఇచ్చింది. త్రివిక్రమ్ కూడా అతడు సినిమా తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూసాడు. 

 

జల్సా సినిమా కోసం త్రివిక్రమ్ కూడా చాలా కష్టపడి చేసాడు అని అంటూ ఉంటారు. తమ కెరీర్ మీద ఇద్దరు చాలా నమ్మకం పెట్టుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఆ విధంగా ఈ సినిమా వారికి మంచి ప్లస్ అయింది. ఇక ఈ సినిమా తో కొందరికి బలం కూడా వచ్చింది అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: