ఒకో సమయంలో ఒకో హీరోకి ఒకో సినిమా కలిసొస్తుంది.. కొంతమందికి వరుసగా హిట్స్ ఉన్నప్పటికీ ఒకానొక టైంలో శని పట్టి అన్ని ప్లాప్ లే అయ్యాయి.. కానీ ఒక్క సినిమాతో మళ్లీ టాలీవుడ్ టాప్ హీరో అవుతాడు.. ఆలా ఏ హీరోకి ఏ సినిమా కలిసివచ్చి టాలీవుడ్ లో అతని రేంజ్ పెంచిందో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఎన్టీఆర్.. సీనియర్ ఎన్టీఆర్ మనవడు.. హరి కృష్ణ కొడుకు.. ఇలా అన్నింటి సహాయంతో టాలీవుడ్ లోని అడుగుపెట్టిన తారక్ కి కచ్చితంగా 20 సంత్సరాలు అయ్యింది.. ఇంకా అలా అడుగు పెట్టి ఎన్నో సూపర్ హిట్లు.. ఎన్నో అట్టర్ ప్లాప్ లు చూశాడు.. అయితే ఎన్టీఆర్ మాత్రం ఓ సూపర్ హిట్ సినిమాతో మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. 

 

టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాడు.. అలాంటి సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. సింహాద్రి. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ని ఓ మలుపు తిప్పింది. ఇందులో ఏలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అవుతుంది.. ఇంకా అలానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 

 

అలాంటి సింహాద్రి సినిమాలో కొన్ని హైలెట్ సీన్స్ ఉన్నాయి.. ఆ సీన్ల వల్లే ఎన్టీఆర్ అంత పెద్ద హిట్ కొట్టగలిగాడు.. ఆ హిట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఫైట్ సీన్.. దుర్గ మాతకు రక్తాభిషేకం చేస్తాడు కదా! సినిమా కోసమే స్పెషల్ గా సృష్టించిన ఆయుధంతో  ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఫైట్ సిన్ అవుట్ స్టాండింగ్ రేంజ్లో తీసి ఎం తీసాడు రా బాబు అని అనిపించేలా చేసిన సిన్ ఇదే. అప్పటి వరుకు ఆచి తూచి అడుగులు వేసిన రాజమౌళికి.. ఎన్టీఆర్ కి ఈ సినిమా ఓ మలుపు అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: