టాలీవుడ్ లో కొందరు హీరోలు ఎప్పటి నుంచో ఉన్నా సరే ఒక్క హిట్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఒక్కటి కూడా హిట్ అవ్వకపోవడం తో వాళ్ళల్లో నిరాశ అనేది ఒక స్థాయిలో ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి వాళ్లకు ఒక్క మంచి  విజయం ఉంటే చాలు అనేది వాస్తవం. ఇలా ఒక్క హిట్ వచ్చినా చాలు అనుకున్న హీరో ఎవరు అయినా ఉన్నారు అంటే టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్. అతని సినిమాల కోసం ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు గాని... 

 

అంతకు ముందు నితిన్ సినిమా వస్తుంది పోతుంది అన్నట్టే ఉండేది. ఆయన కెరీర్ లో దాదాపు 10 ఫ్లాపుల తర్వాత చేసిన సినిమా ఇష్క్. నిత్యా మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత నితిన్ ఇక ఆలోచించాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలు చేసాడు. వరుస విజయాలు సాధించాడు. ఇటీవల భీష్మ సినిమా తో అతను కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ఒక పరభాషా రీమేక్ సినిమాను లైన్ లో పెట్టాడు. 

 

ఇష్క్ సినిమా తర్వాత అతని మీద దర్శక నిర్మాతలకు ఒక నమ్మకం వచ్చింది అనేది వాస్తవం. అతని సినిమాలకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు అనే నమ్మకం కలిగించింది ఆ సినిమా అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత అతను మరో ఆలోచన లేకుండా సినిమాలు చేసాడు. ఇటీవల వచ్చిన భీష్మ సినిమా అతన్ని కమర్షియల్ హీరో గా కూడా మార్చింది అని అంటున్నారు టాలీవుడ్ జనం. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: