టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. అతని తో సినిమా అనగానే దర్శకులకు నిర్మాతలకు ఒక రకంగా పండగ అనే చెప్పాలి. తారక్ తో సినిమా చేస్తే హిట్ కొట్టే అవకాశం ఉంటుంది అనే భావన దర్శక నిర్మాతలకు ఉంటుంది. ఇప్పుడు కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు ఏ ఒక్కటి కూడా పెద్దగా ఫ్లాప్ అయిన సందర్భం లేదు అనే చెప్పాలి. అతని కెరీర్ లో ప్రస్తుతం మంచి సినిమాను చేస్తాడు. 

 

ఒక రకంగా చెప్పాలి అంటే అతను ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా భారీ ప్రయోగం అనే చెప్పాలి. అయితే అతని కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ఒకటి ఉంది. అదే టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా అతని క్రేజ్ ని అమాంతం పెంచింది అనేది వాస్తవం. అతని కెరీర్ లో ఆ సినిమా ఒక సంచలనం అని అంటూ ఉంటారు ఎన్టీఆర్ ఫాన్స్. ఆ విధంగా ఆ సినిమా ఎన్నో సంచలనాలు నమోదు చేసి౦ది. ఆ సినిమా కు ముందు ఎన్టీఆర్ ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం చూడగా ఈ సినిమా రూపంలో అతనికి ఆ హిట్ వచ్చింది. 

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఆయన ఫాన్స్ చాలా కొత్తగా చూసారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అతను వరుసగా సినిమాలు చేసి హిట్స్ కొట్టినా సరే అతని కెరీర్ లో ఆ సినిమాను బిగ్గెస్ట్ హిట్ గా చెప్తారు కొందరు ఫాన్స్. ఇక అక్కడి నుంచి అతని రేంజ్ కూడా భారీగా పెరిగింది అనేది టాలీవుడ్ జనాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: