టాలీవుడ్ లో విక్టరి వెంకటేష్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని సినిమాలు అనగానే గతంలో ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉండేది. యంగ్ హీరో గా ఆయన ఎన్నో మంచి సినిమాలను అప్పట్లో చేసే వారు. ప్రయోగాలు కూడా ఆయన కెరీర్ లో చాలానే ఉన్నాయి. ఏ సినిమా ఆఫర్ వచ్చినా సరే నేను చేయను అనకుండా మంచి సినిమాలు చేసాడు వెంకటేష్. అతని కెరీర్ లో చాలా వరకు విజయాలే మనకు కనపడుతూ ఉంటాయి అనేది వాస్తవం. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకునే సినిమా కూలీ నెంబర్ 1. 

 

సినిమా ఆయన కెరీర్ ని మార్చింది అంటారు టాలీవుడ్ ప్రముఖులు. ఆయన కెరీర్ లో ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత్ ఆనే విధంగా ఉంది పరిస్థితి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ చాలా కష్టపడి నటించాడు అని విదేశాల్లో షూటింగ్ ఉన్నా సరే భయపడకుండా ఆ రోజుల్లో వెళ్లి చేసాడు అని అంటారు. యువ హీరోలకు అప్పుడు ఈ సినిమా ఓక ఆదర్శం అనే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ సినిమా అప్పుడు వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అక్కడి నుంచి ఆయనకు వరుస ఆఫర్లు వచ్చేసాయి. ఇక ఆలోచించాల్సిన అవసరం లేకుండా సినిమాలు చేసారు అనే చెప్పుకోవచ్చు. 

 

ఆయన తండ్రి బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేసాడు వెంకటేష్. ప్రస్తుతం అతను నారప్ప అనే రీమేక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అతనికి చాలా ప్రత్యేకం అని కూడా అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ తనలో చాలా మార్పులు చేసుకున్నారు అని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: