హ్యాపీ డేస్ సినిమా తో నాలుగురు హీరో ల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ సిద్దార్థ్‌. ఆ సినిమా తరువాత అంకిత్, పల్లవి అండ్‌ ఫ్రెండ్స్, యువత, కలావర్‌ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో లాంటి సినిమా లు చాలా ఈ సినిమాలు నిఖిల్ కెరీర్‌ కు ప్లస్‌ కాకపోగా మరింతగా నష్టం చేశాయి. ముఖ్యంగా ప్రతీ సినిమా లోనూ రవితేజ ను ఇమిటేట్‌ చేస్తున్నట్టుగా నటించటంతో నిఖిల్ కెరీర్‌ అసలు పట్టా లెక్కలేదు. భారీ చిత్రాల్లో అవకాశాలు కూడా రాలేదు.

 

ఆ సమయం లో నిఖిల్ కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమా స్వామి రారా. సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ కెరీర్‌ కు ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో దొంగ నటించిన నిఖిల్ తనదైన స్టైల్‌ లో నటించి మెప్పించాడు ఈ సినిమాతో నిఖిల్ హీరోగా సెటిల్‌ అయ్యాడు. నిఖిల్ సరసన స్వాతి హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి నిర్మించాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో అప్పటి వరకు యూత్‌ ఫుల్ సినిమాలు మాత్రమే చేసిన నిఖిల్ ఈ తరువాత మెచ్యూర్డ్‌ సినిమాలు చేయటం ప్రారంభించాడు.

 

సినిమా తరువాత వరుస హిట్స్‌తో హీరోగా స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు నిఖిల్‌. స్వామి రారా సక్సెస్ తరువాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవల అర్జున్‌ సురవరం సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్‌. ఈ ప్రస్తుతం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా లో నటిస్తున్నాడు నిఖిల్‌. ఈ సినిమా తో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ లో పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం లో తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: