టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతో హీరోగా బాక్సాఫీస్‌ దగ్గర యావ‌రేజ్ మార్కులు వేయించుకున్న ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో  స‌క్సెస్ కొట్టాడు. ఇలా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెండో సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన సుబ్బు సినిమా ప్లాప్‌ అయినా ఆ వెంటనే వి.వి.వినాయక్ దర్శకుడు పరిచయం అయిన ఆది సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ పూర్తిగా మార్చేసింది. అప్పటికే ఎన్టీఆర్ కు పూర్తి మీసం కూడా రాలేదు.

 

నందమూరి తారక రాముడిని ఆది సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 98 కేంద్రాల్లో నేరుగా వంద రోజులు పూర్తి చేసుకుంది. షిఫ్టుల్లో మ‌రి కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఫ్యాక్ష‌న్ నేప‌థ్య క‌థాంశంతో వచ్చిన ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించ‌గా వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌ అందించిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ సైతం అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న కీర్తీచావ్లా హీరోయిన్‌గా న‌టించింది. త‌ర్వాత వ‌చ్చిన అల్ల‌రి రాముడు సినిమా ప్లాప్ అయినా ఆ వెంట‌నే వ‌చ్చిన సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ అన్ని రికార్డులు మ‌టాస్ చేసేశాడు. అమ్మ తోడు అడ్డంగా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, రాయ‌ల‌సీమ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన‌ప్పుడు చేసిన యాక్ష‌న్ అన్ని ఇప్ప‌టికి ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచి పోయాయి. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వ‌చ్చినా ఎన్టీఆర్‌ను త‌క్కువ వ‌య‌స్సులోనే తిరుగులేని స్టార్‌ను చేసింది మాత్రం ఆది సినిమాయే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: