మంచు మోహన్ బాబు వారుసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నటుడు మంచు మనోజ్‌. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇంత వరకు కెరీర్‌లో ఆశించిన స్థాయి సక్సెస్‌ సాధించలేకపోయాడు. బాల నటుడిగా ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన మనోజ్‌, హీరోగా మాత్రం ఒక్క సూపర్‌ హిట్ కూడా అందుకోలేకపోయాడు. దొంగా దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మనోజ్. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అనిపించుకోలేకపోయినా మనోజ్‌ కు హీరో మంచి క్రేజ్‌ నే తీసుకువచ్చింది. తొలి సినిమాతో తన మీద ఉన్న అంచనాలను అందుకున్నాడు మనోజ్.

 

ఆ తరువాతే పూర్తిగా గాడి తప్పాడు మనోజ్‌. తరువాత వరుసగా  శ్రీ, రాజు భాయ్‌, నేను మీకు తెలుసా లాంటి డిజాస్టర్‌ సినిమాల్లో నటించాడు. తరువాత ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ప్రయాణం సినిమాలో హీరోగా నటించాడు . ఆ సినిమా సక్సెస్‌ కాకపోయినా హీరోగా మనోజ్‌కు కెరీర్‌ కు మాత్రం ప్లస్ అయ్యింది. ఇక మనోజ్‌ కెరీర్‌ లో ఒకే ఒక్క హిట్ సినిమా బిందాస్‌. 2010లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వీరు పోట్ల దర్శకుడు.

 

ఎకే ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామ్ బ్రహ్మం నిర్మించిన ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో తొలి బిగ్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తో వచ్చిన సక్సెస్‌ను సరిగ్గా వాడుకోవటంతో మనోజ్ ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత వేదంలా ప్రయోగాత్మక చిత్రం చేసిన మనోజ్‌ కెరీర్‌కు ఏమాత్రం ప్లస్‌ కాలేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాధం లాంటి సినిమా కూడా మనోజ్‌ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయింది. ఆ తరువాత పోటుగాడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, శౌర్య, ఎటాక్‌ లాంటి సినిమాలు చాలా చేశాడు మనోజ్‌, కానీ ఏ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: