క్రేజ్ కి క్రేజ్ ముక్కుసూటిగా మాట్లాడే హీరో విజ‌య్‌దేవర‌కొండ‌. ఆయ‌న ప్ర‌స్తుతం ఓ గాసిప్ వెబ్‌సైట్ పై మండిప‌డుతున్నాడు. అర్ధం ప‌ర్ధం లేని వార్త‌లు రాసి జ‌ర్న‌లిజానికి చెడ్డ‌పేరు తీసుకురావ‌ద్దంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. అలాగే సెల‌బ్రెటీల జీవితాలంటే ప్ర‌తిసామాన్య వ్య‌క్తి తొంగి చూద్దామ‌ని చూస్తాడు, ఏమి జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి తెగ ఆశ‌క్తి చూపిస్తాడు. అదే ఇప్పుడు విజ‌య్ విష‌యంలో కూడా జ‌రిగింది. దీంతో విజ‌య్ తెగ మండిపోతున్నాడు. క‌రోనా వైర‌స్ విజృంభించిన నేప‌ధ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ప‌నుల్లేక లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో ఏమి చెయ్యాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి సందర్భాల్లో ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు హీరోలు ముందుకొచ్చి ఎవ‌రికి త‌గిన సాహాయాన్ని వారు అందిస్తున్నారు. ఇందుకు అంద‌రూ కూడా కృత‌జ్ఞులై ఉండాలి. అయితే విజ‌య్ ఈ విష‌యానికి సంబంధించి ముద‌ట్లో స్పందించ‌లేదు. ఎందుకంటే విజ‌య్ స్టైల్ కాస్త డిఫ‌రెంట్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే క‌దా.

 

తాను ఏమి చేసినా కాస్త వెరైటీగా ఉండేలా చూస్తాడు. మ‌రి ఈ విష‌యంలో కూడా మ‌నోడు అలాగే చేశాడు. `మిడిల్ క్లాస్ ఫండ్‌` పేరుతో ఓ వెబ్ సైట్ ని ప్రారంభించి, పాతిక ల‌క్ష‌ల ప్రాధ‌మిక నిధితో, క‌నీసం 2 వేల కుటుంబాల్ని ఆదుకోవాల‌నుకు‌న్నాడు. వెబ్ సైట్ ప్రారంభించిన త‌ర‌వాత‌.. విరాళాలు భారీగా వ‌చ్చాయి. 25 లక్ష‌ల ఫండ్ కాస్త‌.. 70 ల‌క్ష‌ల‌కు చేరింది. సాయం అందుకునే కుటుంబాల సంఖ్య పెరిగింది. నిజానికి ఇవ‌న్నీ అంద‌రూ ఆనందించాల్సిన విష‌యం. అయితే ఇదంతా ఓ గాసిప్ వెబ్ సైట్ దీన్ని మార్చి మార్చి చీల్చి చెండాడి దీన్ని ఒక నెగిటివ్ వార్త‌గా రాసింది. విమిడిల్ క్లాస్ ఫండ్ త‌న కార్య‌క‌లాపాల్ని మొద‌లెట్టిన మ‌రుస‌టి రోజే – విజ‌య్ పేద ప్ర‌జ‌ల‌ని అవ‌మానించాడంటూ ఓ అర్ధం ప‌ర్ధం లేని వార్త‌ని రాసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కేవ‌లం’ 25 ల‌క్ష‌లు ఇవ్వ‌డం ఏమిటి? ‘కేవ‌లం’ 7500 మందికి స‌హాయం చేయ‌డం ఏమిటి? అదీ ఇదీ అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆ వార్త‌లో రాశారు. అంతేనా ఉచితంగా ఓ స‌ల‌హా కూడా ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ఏదో ఓ గ‌ల్లీని ఎంచుకుంటే స‌రిపోతుంతి క‌దా, అంటూ ఉచిత స‌ల‌హా పారేసింది. ఇది చాల‌ద‌న్న‌ట్టు… మ‌రో వార్త‌. చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సీసీసీకి సాయం చేయ‌కుండా, త‌న సొంతానికి ఛారిటీ చేస్తున్నాడ‌ని, పార‌లల్ ఇండ్ర‌స్ట్రీని న‌డ‌పాల‌ని చూస్తున్నాడ‌ని ఎవ‌రికీ అర్థం కాని కోణాన్ని కూడా రాసి లేనిపోని ఆలోచ‌న‌లు క‌లుగ‌జేసింది.

 

దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండకు విసుగెత్తిపోయి. త‌న‌దైన స్టైల్‌లో ఈ వార్త‌ల పై స్పందించి స‌ద‌రు వెబ్‌సైట్ తాడ‌తీశాడు. ఓ వీడియో తీశాడు దాదాపు 21 నిమిషాలు సాగిన ఈ సుదీర్ఘ‌మైన వీడియోలో గాసిప్ వెబ్ సైట్ ని ఓ ఆట ఆడుకున్నాడు. “ప‌క్క‌నోడ్ని హింస‌పెట్టి, మ‌రీ తొక్కేసి మ‌నం బాగుప‌డాలి.. మ‌నం ముందుకెళ్లాలి అనే బ్యాచ్‌” అంటూ మొద‌లుపెట్టి ఆ వెబ్ సైట్ పేరు చెప్ప‌కుండానే తెగ ఆడేసుకున్నాడు.“మ‌‌న‌ల్ని వాడి, మ‌న‌కు త‌ప్పుడు వార్త‌లు అమ్మి, వాళ్ల త‌ప్పుడు అభిప్రాయాలు మ‌న‌మీద రుద్ది.. డ‌బ్బులు చేసుకుంటున్నారు” అంటూ మెల్ల‌మెల్ల‌గా త‌న కోపాన్ని మొత్తం చూపించాడు. “మీరు బ‌తికేదే మామీద‌, యాడ్లు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోతే, చిల్ల‌ర క‌బుర్లు రాసి, డ‌బ్బులు సంపాదిస్తారు” అంటూ ఎదురు దాడికి దిగాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఏడి? ఎక్క‌డ దాక్కున్నాడు? విరాళాలు ఇవ్వ‌డా? అని ప్ర‌శ్నించిన ఆ వెబ్ సైట్ కి “నాకు కుదిరినప్పుడు, నాకు న‌చ్చినప్పుడు, నా మ‌న‌సుకి ఎవ‌రు క‌నెక్ట్ అయితే. వాళ్ల‌కి ఇస్తా.. అస‌లు మీరెవ‌రు న‌న్ను అడ‌గ‌డానికి?“ అంటూ గ‌ట్టిగా స‌మాధానం చెప్పాడు. స‌ద‌రు వెబ్ సైట్ ప్ర‌చురించిన వార్త ప్రింటౌట్ తీసి మ‌రీ.. ప్ర‌తీ లైనుకీ వివ‌ర‌ణ ఇచ్చుకుంటూ వెళ్లాడు.

 

ఇక ఆ వార్త‌లో విజ‌య్‌ని బాధ‌పెట్టే కొన్ని అంశాలు ఉండ‌డంతో “నాకు ఈ ఉచిత స‌ల‌హాలు మానేసి మీరు సాయం చేయొచ్చు క‌దా..” అని స‌ద‌రు వెబ్ సైట్‌కి ఎదురు స‌ల‌హా ఇచ్చాడు. మిడిల్ క్లాస్ ఫండ్ వ‌ల్ల సాయం పొందిన కొంత‌మంది పేర్లు ప్ర‌స్తావించి, వాళ్ల క‌ష్టాల్ని కూడా క‌ళ్ల‌కు క‌ట్టాడు. సీసీసీకి 5 ల‌క్ష‌లు విరాళం అందించాన‌ని, అది కూడా తెలియ‌కుండా వార్త‌లు అల్లేయ‌డం జ‌ర్న‌లిజం అనుకోద‌ని.. క్లాసు పీకాడు.. అంతేనా అస‌లు ఆ వెబ్‌సైట్ ఆ వార్త‌లు రాయ‌డానికి కార‌ణం కూడా చెప్పాడు.“రెండు రోజుల క్రితం న‌న్ను ఇంట‌ర్వ్యూ ఇమ్మ‌ని అడిగారు. ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా నెగిటీవ్ వార్త‌లు రాశారు..” అంటూ అస‌లు విష‌యాన్ని చెప్పేశాడు రౌడీ. ఈ వీడియో మొత్తం చూస్తే స‌ద‌రు వెబ్ సైట్ వార్త‌ల ముసుగులో చేసే అరాచ‌కాలు, బ్లాక్ మెయిలింగులూ అర్థ‌మైపోతాయి. మ‌రి ఇది స‌రైన ప‌ని కాదు. ఎవ‌రో ఒక‌రు స‌హాయాన్ని అందిస్తున్నారు. ముందు ప్ర‌స్తుతం ఉన్న గ‌డ్డుకాలంలో అది చాలా ముఖ్యమ‌నుకోవాలి కాని ఇలాంటి వార్త‌లు రాయం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం.

మరింత సమాచారం తెలుసుకోండి: