తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్. ఆరడుగుల అందగాడు ఆరు పలకల దేహంతో ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. తనదైన యాక్షన్ తో అటు  మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించటమే  కాదు... ఇటూ  క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తూనే ఉన్నాడు ప్రభాస్. అయితే కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్... మొదట ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా  పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

 

 

 ఈ క్రమంలోనే సాదా సీదా హీరోగా కెరియర్లో ముందుకు వెళ్తున్న ప్రభాస్ ని ఒక్కసారిగా స్టార్ హీరోలా మర్చి  స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకొచ్చి దర్శకులు చూపు మొత్తం ప్రభాస్ వైపు మళ్లేలా చేసిన సినిమా చత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమాలో ప్రభాస్ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. తనదైన యాక్షన్ తో ప్రభాస్ ప్రేక్షకులందరినీ మెప్పించి రెబల్ స్టార్ గా మారిపోయాడు. ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ చత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చినంత  క్రేజ్  అంతకు ముందు ఏ సినిమా కు రాలేదు. 

 

 

 అప్పుడు వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన ప్రభాస్ చత్రపతి సినిమాతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయి బాగా ఉర్రుతలూగించాడు. అడుగడుగున అణచివేతకు గురవుతున్న పేద వాడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో తెరకెక్కినది  ఈ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ ఎవర్గ్రీన్ గా నిలిచింది అని చెప్పవచ్చు. చత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: