నందమూరి తారక రామారావు తన జీవితంలో 400 పైగా తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించి గొప్ప నటుడిగా పేరు పొందారు. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో విభిన్నమైన పాత్రలో అద్భుతంగా నటించి తన కంటే ఎవరు గొప్పగా నటించారు లేరేమో అన్నట్టు నటించే అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతకాలం తారక రామారావు బ్రతికే ఉంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అందుకే తనకు విశ్వవిఖ్యాత, నటనా సార్వభౌముడు లాంటి గొప్ప బిరుదులు వచ్చాయి.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఎన్టీఆర్ తన కాలేజీ విద్యాభ్యాస సమయంలో తమ కుటుంబ ఆస్తులన్నీ పోయాయి. దాంతో రామారావు తన యుక్తవయసులోనే డబ్బు సంపాదించేందుకు పాల వ్యాపారం కిరాణా కొట్టు తదితర పనులను చేస్తూ మరోవైపు తన చదువుని కొనసాగించాడు. చదువు పూర్తయిన అనంతరం పరీక్షలు రాసి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు గా ఉద్యోగంలో చేరాడు. ఆ క్రమంలోనే ప్రముఖ ప్రొడ్యూసర్ బి.ఎ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటో చూసి పల్లెటూరి సినిమాలు కథానాయకుడిగా ఎంపిక చేసాడు.


సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం అయినప్పటికీ... రామారావు మరొక చిత్రమైన పల్లెటూరి పిల్ల లో నటించి వెయ్యి నూటపదహార్లు పారితోషికంగా తీసుకున్నారు. తర్వాత ఎన్టీ రామారావు అనేకమైన సినిమాల్లో నటించాడు కానీ తనకి మంచి నటుడిగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఆ ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి తన సినిమా ఆయన పాతాళభైరవిలో కథానాయకుడిగా రామారావు ని ఎంపిక చేశారు. ఆ చిత్రంలో ఎస్.వి.రంగారావు ప్రతినాయకుడిగా చేశాడు. అప్పట్లో ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. నిజానికి ఈ ఒక్క సినిమానే కె.వి.రెడ్డి జీవితాన్ని మార్చడంతో పాటు ఎన్టీఆర్ ఎస్వీ రంగారావుల సినీ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. పాతాళభైరవి సినిమా తర్వాత రామారావుకి ఎన్నో సినీ అవకాశాలు వచ్చాయి. అలా తాను సినీ రంగంలో తర్వాత రాజకీయ రంగంలో కూడా ఎదురులేని మనిషి గా దూసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: