అడవి రాముడు... సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు అనగానే ప్రేక్షకుల ముందు కనపడే సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ పెరిగిన విధానం దర్శకుడి రేంజ్ పెరిగిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పడిన కష్టం ఆ తర్వాత ఆ సినిమా సాధించిన విజయం తో కనుమరుగు అయిపోయింది అనేది వాస్తవం. ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ కూడా ఒకానొక సమయంలో నాకు అడవి రాముడు లాంటి హిట్ కావాలి అని దర్శకులను అడిగారు. 

 

అంటే ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు అనే చెప్పవచ్చు. ఈ సినిమా సాధించిన రికార్డులు అయితే ఎన్నో ఉన్నాయి. కొన్ని థియేటర్స్ లో వందల రోజులు ఆడింది ఈ సినిమా. ఈ సినిమాలో పాటలు  మాస్ ప్రేక్షకులకు బాగా బాగా నచ్చాయి అప్పట్లో. ఈ సినిమా తర్వాత ఆయన కోసం బాలీవుడ్ దర్శకులు కూడా హైదరాబాద్ వచ్చిన సందర్భం కూడా ఉంది అని చెప్తూ ఉంటారు కొందరు. 

 

సినిమా టీవీ లో వస్తే ఇప్పటికి కొందరు పనులు మానుకుని చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి నటించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద  మలుపు అని అప్పట్లోనే ఆయనకు ఈ సినిమా కమర్షియల్ గుర్తింపు తీసుకొచ్చింది అని అంటూ ప్రేక్షకులు. ఈ సినిమా తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారు అని అంటారు ప్రేక్షకులు కూడా. ఆ విధంగా ఈ సినిమా విజయం సాధించింది. ఎన్ని సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చినా సరే అడవి రాముడు క్రేజ్ మాత్రం ఎప్పటికి తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: