ఇప్పుడు టాలీవుడ్ లో కమర్షియల్ హీరోలు చాలా తక్కువగానే ఉన్నారు అనే సంగతి తెలిసు. బాలీవుడ్ హీరోలు అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్న వేళ మన వాళ్ళు అలాంటి సినిమాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిన్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే తెలుగు సినిమాను మాత్రం వంద కోట్ల వరకు తీసుకుని వెళ్ళిన ఘనత ఒక సినిమాకు దక్కుతుంది. ఏ సినిమా అంటే కొరటాల శివ మొదటి సినిమా మిర్చి. ప్రభాస్ హీరో గా వచ్చిన ఈ సినిమా కొన్ని సంచలనాలు నమోదు చేసింది అప్పుడు. 

 

సామాజిక కోణం లో తీసిన ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ని పెంచడమే కాదు కమర్షియల్ హీరో గా కూడా ప్రభాస్ ని మార్చింది అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమా చేసాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ని చాలా కొత్తగా ఫ్యాక్షన్ హీరో గానే కాకుండా లవర్ బాయ్ గా కూడా దర్శకుడు చూపించారు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా అప్పుడు వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా భారీ గానే వసూలు చేసాడు. 

 

సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ ఇక ఆలోచిన్చుకోవాల్సిన అవసరం ఎక్కడా రాలేదు. ఆయనకు మంచి ఆఫర్లు ఇచ్చారు హీరోలు. నిర్మాతలు కూడా ఆయన సినిమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అనే సంగతి తెలిసిందే. కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమాలు అనే గుర్తింపు వచ్చింది మిర్చి సినిమా తో. మిర్చి సినిమాను చాలా జాగ్రత్తగా తీసి తన కెరీర్ ని మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆచార్య అనే సినిమాను చిరంజీవి హీరో గా చేస్తున్నారు కొరటాల. ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: