మహేష్ బాబు... ఈ పేరు చాలా మందికి ఒక ఊపు ఇస్తుంది అనేది వాస్తవం. వరుస హిట్స్ వచ్చినా రాకపోయినా వరుస సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఈయన గారికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. మహేష్ బాబు కెరీర్ లో కొన్ని కొన్ని సినిమాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అభిమానులు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఒక మైలురాయి గా చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు సినీ పరిశీలకులు. 

 

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని మార్చేసింది అని అంటూ ఉంటారు అభిమానులు. ఈ సినిమా కథ కూడా చాలా భిన్నంగా ఉంటుంది అని అంటారు. బాహుబలి 1 విడుదల అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమా తో కమర్షియల్ హీరో గా మారిపోవడమే కాకుండా పారితోషికం కూడా భారీగా పెంచి టాలీవుడ్ కి కొత్తదనం పరిచయం కూడా చేసాడు అని చెప్తూ ఉంటారు. అప్పటి వరకు ఉన్న నిర్మాతల ఆలోచనను మహేష్ బాబు మార్చేశాడు అని అంటారు. 

 

సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల రేంజ్ కూడా ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట వాస్తవ౦. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అన్నీ కూడా కమర్షియల్ సినిమాలే చేసాడు అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన పరుశురం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుత౦ షూటింగ్ ముందు కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: