ప్రస్తుతం మన దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతుండడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ ఇళ్లలో ఉండిపోవడం జరిగింది. దీనితో అన్ని రంగాలు మూతపడడం, అనేకమందికి చేయడానికి పనులు లేక తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు సందర్బలు తలెత్తాయి. దీనితో అటువంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాలను సాయంగా ప్రకటించడం జరుగుతోంది. అయితే ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలను మేము సైతం ఆదుకుంటాం అంటూ అనేక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ మంచి మనసుతో ముందుకు వస్తుండగా, మన టాలీవుడ్ నుండి కూడా అనేకులు ఇప్పటివరకు తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చారు. 

 

ఇక యువ నటుడు విజయ్ దేవరకొండ కూడా ఇటీవల రూ.1.30 లక్షలు విరాళం అందించడంతో పాటు తన పేరిట ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి కొందరు టీమ్ సభ్యుల సాయంతో పూట గడవని వారికి నిత్యావసరాలు అందించడం చేస్తున్నారు. అయితే విజయ్ నెలకొల్పిన ఫౌండేషన్ పై అలానే ఆయన వ్యక్తిగత జీవితంపై కొంత తప్పుగా రాతలు రాసిన ఒక వెబ్ సైట్ గురించి స్పందిస్తూ నిన్న రాత్రి ఒక వీడియో పోస్ట్ పెట్టిన విజయ్, తన ఆవేదనను వెలిబుచ్చారు. 

 

తనశక్తి కొలది ఎంతో కొంత సాయం చేస్తున్నానని, అలానే మా ఫౌండేషన్ కు ఎందరో మంచి వారు విరాళాలు ఇస్తూ ఇంకెందరికో ఆకలిని తీరుస్తుంటే, ఈ విధంగా తప్పుగా రాసి అందరిలో గందరగోళం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని విజయ్ ఆ వీడియోలో తెల్పడం జరిగింది. కాగా వీడియో పోస్ట్ చేయగానే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ, నీకు నేనున్నాను సోదరా, ఇటువంటి తప్పుడు కథనాలపై అందరం కలసి పోరాటం చేద్దాం అంటూ మహేష్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. కాగా నేడు కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సోదరా విజయ్, నీ ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను, ఈ విధంగా అర్ధం పర్ధం లేని తప్పుడు వార్తల వలన నేను, నా కుటుంబం గతంలో కూడా ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి, నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చి ఇటువంటి తప్పుడు వార్తలు రాసే వారిని గుర్తించి ఎదిరించావు శభాష్, నీకు మేమందరం ఈ విషయంలో పూర్తిగా సపోర్ట్ ని అందిస్తాం అంటూ మెగాస్టార్ తన ట్వీట్ లో తెలిపారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: