ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో సామాన్య ప్రజల నుంచి సినీ తారలు, ఇతర రంగ ప్రముఖులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఈ తరుణంలో షూటింగ్ లు అన్నీ కూడా నిలిపి వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ఎంటర్టైన్మెంట్ రంగంపై ప్రభావం బాగానే పడింది. ఇక మరోవైపు లాక్ డౌన్ నుంచి బయట పడేందుకు ఈ రంగాలకు కేంద్ర ప్రభుత్వం సడలింపు చేసింది. ఈ తరుణంలో అతి త్వరలోనే ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా మినహాయింపు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో జూన్ నెల నుంచి షూటింగ్ లో మొదలు అవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

IHG


ఇక ఈ క్రమంలో నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా షూటింగ్లకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా షూటింగ్ మొదలు అవుతాయి తప్ప సినిమా హాళ్లను మాత్రం ఇప్పటి లో ప్రారంభం కావు అని సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా కొత్త కేసులు నమోదు అవ్వని రాష్ట్రాలలో ఎంటర్టైన్మెంట్ రంగం, పబ్లిక్ రవాణాలను ప్రారంభించకూడదని అంటూ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనితో మరో రెండు నెలల వరకు థియేటర్లు మొదలు కావని సమాచారం.

 


ఇక మరో వైపు తెలంగాణ సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని  టీవీ ఛానళ్ల ప్రతినిధులు షూటింగులకు అనుమతులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఇక మొత్తానికి ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చూడాలి మరి. ఎప్పుడు ఈ కరోనా అదుపులోకి వస్తుందో మనమందరం మళ్లీ ఎప్పుడు సుఖంగా ఉంటామో అర్ధం కావడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: