ఆంధ్ర అమితాబ్, మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. మొదటిలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ... కాలక్రమేణా సినిమాలలో కథానాయకుడి పాత్రలో నటించే అవకాశాలను చేజిక్కించుకున్నాడు. 1991వ సంవత్సరంలో తాను కర్తవ్యం సినిమా ద్వారా వెండితెరకు పరిచయము కాగా... 1999లో సినిమా హీరోగా నటించే ఛాన్స్ లభించింది. ఆ సినిమా పేరు నీ కోసం. 8 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం అనేక అవస్థలు పడ్డాడు. బడ్జెట్ పద్మనాభం సినిమా లో ఏకంగా ఓ గోచీ గుడ్డ కట్టుకొని వెండితెరపై కనిపించేందుకు ఒప్పుకున్నాడు. 1999లో శ్రీను వైట్ల దర్శకత్వంలో నీ కోసం సినిమా చేసిన తదనంతరం కూడా అతిథి పాత్రల్లో, క్షేమంగా వెళ్లి లాభంగా రండి తిరుమల తిరుపతి వెంకటేశ, అన్నయ్య లాంటి కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


మళ్లీ 2001వ సంవత్సరం లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ ద్వారా హీరో గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మంచి హిట్ ను అందుకున్నాడు. ఆపై అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా లో కూడా హీరోగా నటించి మంచి విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి ఇడియట్ సినిమాలో నటించిన రవితేజ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఖడ్గం సినిమాలో రవితేజ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో రవితేజ అద్భుతమైన నటనకు గాను విజేత, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు లభించాయి. ఆ తరువాత దాదాపు పది సినిమాలలో నటించాడు కానీ అవేమి బ్లాక్ బస్టర్ హిట్లు కాలేదు.


2006వ సంవత్సరంలో దర్శక దిగ్గజం రాజమౌళి ఫుల్ ఎంత యాక్షన్ మూవీ అయిన విక్రమార్కుడు లో రవితేజకు హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం యొక్క కథ చాలా బాగుండటం, రవితేజ ద్విపాత్రాభినయం లో అద్భుతం గా నటించడం అన్నీ కలిసొచ్చాయి చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కారణంగానే రవితేజ పాపులారిటీ అమాంతంగా పెరిగింది. ఆ తర్వాత ఛాన్సులు కూడా అనేకం వచ్చిపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: