కోలీవుడ్ తలా అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే అజిత్ కుమార్ ఒక బైక్ రేసర్ కూడా. అందుకే అతని సినిమాల్లో బైక్ చేజింగ్ సన్నివేశాలు చాలా రియాలిటీగా ఉంటాయి. ఈ కారణంగానే అజిత్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. సినిమాలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా అజిత్‌ చాలా బైకులను కలిగి ఉన్నాడు. అజిత్‌కు ఇష్టమైన హాబీల్లో ఒకటి బైక్‌లపై లాంగ్ రైడ్ వెళ్లడం. దీన్ని నిదర్శనంగా ఇటీవల ఒక సంఘటన జరిగింది. అజిత్ షూటింగ్ తర్వాత హైదరాబాద్ నుండి చెన్నై తిరిగి రావడానికి లాక్ డౌన్ సమయంలో విమానయాన సేవలు రద్దు చేయబడ్డాయి. కాబట్టి అజిత్ హైదరాబాద్ నుంచి చెన్నైకి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణించినట్లు ఇది వరకే మనం తెలుసుకున్నాం.

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా అజిత్ తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో అజిత్ ఫోటోలకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగా సుహీల్ చందోక్ అజిత్ పాత సంఘటనలను సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశారు. సుహీల్ చందోక్ వీరం చిత్రంలో అజిత్ సోదరుడిగా నటించాడు. అజిత్ - సుహీల్ చందోక్ ఒకప్పుడు బైక్‌పై సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇద్దరూ స్నేహితులు కూడా. ఈ ప్రయాణంలో భాగంగా టీ తాగడానికి వారు తమ బైక్‌లను ఆపారు. ఈ ప్రాంతంలోని ఒక గుడిసెలో నివసిస్తున్న ఒక కుటుంబం వారిని వచ్చి టీ తాగమని కోరారు. అజిత్ వెళ్లి టీ తాగుతాడు. కుటుంబం అజిత్‌తో కలిసి ఫోటో తీసుకోవాలనుకున్నారు. అజిత్ వారితో ఫోటో తీసుకున్నారు. ఇది అజిత్‌ ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. అంతే కాకుండా ఆ ఫోటోలను ప్రింట్ చేసి వారికి పంపించారట. ఈ విషయాన్ని సుహీల్ చందోక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: