సెట్స్ పై ఉన్న ఆరు సినిమాలపై సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ ఆరు సినిమాల కోసం మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా టార్గట్ గా తెరకెక్కుతుండటం విశేషం.

 

ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మోస్ట్ అవెటెడ్ మూవీ అని చెప్పాలి. బాహుబలి వైబ్రేషన్స్ ఈ సినిమాకు హెల్ప్ కానున్నాయి. బాహుబలి లాంటి ఎపిక్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చేస్తుండటంతో ఈ మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. చరణ్, ఎన్టీఆర్ లకు నార్త్ లో పెద్దగా క్రేజ్ లేదు. అయితే బాహుబలి క్రియేటర్ గా రాజమౌళి బ్రాండ్ తో ఆర్ఆర్ఆర్ కి నార్త్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో జక్కన్న బాహుబలి రికార్డ్స్ నే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 

 

ప్రభాస్ నటిస్తున్న జాన్ మీద దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. బాహుబలితో అద్భుత విజయం అందుకున్న ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ సాహో సినిమాకు బాగా కలిసొచ్చింది. సాహో తెలుగు వెర్షన్ కు ఫ్లాప్ టాక్ వచ్చినా నార్త్ లో మాత్రం వదంకోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు జాన్ కూడా అదే స్థాయిలో ఇటు సౌత్ తో పాటు నార్త్ లో బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోందని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. 

 

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా పాన్ ఇండియా టార్గెట్ గా సిద్ధమవుతోంది. టాలీవుడ్ దాటి ఎప్పుడు పక్క మార్కెట్ పై ఫోకస్ పెట్టని పవర్ స్టార్ ఈ సారి డిమాండ్ చేయడంతో పాన్ ఇండియా టార్గెట్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ బిగ్ స్టార్ కాబట్టి ఇక్కడ కలెక్షన్ల సునామీ ఉంటుంది. కానీ కోలీవుడ్, బాలీవుడ్ లోనే పవన్ ఏ మేరకు నెట్టుకొస్తాడనేది ఆసక్తిగా మారింది. క్రిష్ ఇప్పటికే బాలీవుడ్ లో గబ్బర్, మణికర్ణిక లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాల సక్సెస్ పవన్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. 


ఇదిలా ఉంటే నార్త్ ఇండస్ట్రీ సౌత్ సినిమాల వైపు చూస్తోంది. దక్షిణాదిలో ఆశ్చర్యపరిచే కాంబినేషన్స్ తో పాటు హై బడ్జెట్ సినిమాలకు ప్లానింగ్ చేస్తున్నారు. కాబట్టే బాలీవుడ్ వాళ్లు మన సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ కంటే టాలీవుడ్ విషయంలో ఫాస్ట్ గా ఉంది. తెలుగులోనే ఎఖ్కువగా పాన్ ఇండియా మూవీస్ పట్టాలెక్కుతున్నాయి. 


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో రెండో భాగానికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ రెండవ భాగంలో బాలీవుడ్ నటులను కూడా తీసుకోవడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఈ సిిినిమా మరోసారి పాన్ ఇండియా లెవల్ లో సన్సేషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ లో ఉన్నారు. 

 

ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు2పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కమల్ హాసన్ లాంటి పాన్ ఇండియన్ హీరో గా ఉండటం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: