కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి.. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే రోజూవారీ వేతన కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్‌లో స్టార్స్ ముందుకు వచ్చినట్లే బాలీవుడ్‌ లోనూ స్టార్స్ అందరూ ముందుకు వచ్చారు. దాదాపు స్టార్ హీరోలందరూ భారీ మొత్తంలో ప్రజలను.. తమ సినిమాలకు పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ నుంచి ఎంతో మందికి ఆర్థిక సాయం చేస్తున్నారు.

 

దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కుంటున్న స‌మ‌యంలో తనకి తోచిన విధంగా సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు సల్మాన్. ఇప్పటికే 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని సల్మాన్‌ ఖాన్ ప్రకటించాడు. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేసారు. అందులో భాగంగా తొలి విడతలో పేద సినీ కార్మిక కుటుంబాలకి రూ.3 వేలు అందించిన స‌ల్మాన్.. రెండో నెల‌కు కూడా నిధులు విడుద‌ల చేసాడు. అంటే 25 వేల మందికి ఇప్ప‌టిదాకా ఒక్కొక్క ఫ్యామిలీకి రూ.6 వేల చొప్పున ఇచ్చాడు. ఇలా మొత్తం స‌ల్మాన్ నుంచి రూ.15 కోట్ల సాయం అందించాడు. ఇప్పుడు తన ఫామ్ హౌస్ సమీపంలోని గ్రామాలకు కూడా ఆయన సహాయం అందించారు. 

 

సల్మాన్ ఖాన్ తాజాగా తన పన్వెల్ ఫామ్ హౌస్ సమీపంలో ఉన్న నిరుపేదలకు ఆహార సామాగ్రిని అందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో సల్మాన్ ఖాన్ ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లను నిత్యావసరాలతో నింపి సమీప గ్రామాలకు పంపుతున్నారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లూలియా వంతూర్, కమల్ ఖాన్, నికేతన్ మాధోక్, వాలూస్చా డిసౌసా తదితరులు కూడా నిత్యావసరాలను వాహనాలలో లోడ్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

@jacquelinef143 @vanturiulia @rahulnarainkanal @imkamaalkhan @niketan_m @waluschaa @abhiraj88

A post shared by salman Khan (@beingsalmankhan) on

మరింత సమాచారం తెలుసుకోండి: