దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుందని తెగ వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేంద్రం మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవొచ్చని పరిమిషన్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'దేశ వ్యాప్తంగా నిన్న విడుదలైన వారుణి వాహిని సూపర్ హిట్ అయింది. సెన్సేషనల్ టాక్ సంపాదించుకుంది. బాహుబలి, టైటానిక్ కలెక్షన్లను దాటేలా ఉంది. భారీ వసూళ్లను రాబడుతోంది. మద్యం వల్ల లాభాలు పొందడానికి ఇది సమయమా? ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. మనుషులు చనిపోతున్నారు.. ఇలాంటి సమయంలో మద్యం వ్యాపారంతో జనాల ప్రాణాలు ఫణంగా పెట్టడం ఎంత వరకు న్యాయం అని మహిళా సంఘాలు మొత్తుకుంటున్నాయని అన్నారు.

 

 

యూపీలో రూ. 100 కోట్లు, ఏపీలో రూ. 68 కోట్లు, కర్ణాటకలో రూ. 45 కోట్లు. మిగతా రాష్ట్రాల కలెక్షన్ రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రభుత్వాల నిర్ణయాలను మందుబాబులు మెచ్చుకుంటున్నారు. మహిళలు మాత్రం ప్రభుత్వాలను శపిస్తున్నారు. మొన్నటి వరకు ఎంతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి.. అయితే లాక్ డౌన్ పై మోదీ స్ఫూర్తి  అత్యున్నత స్థాయిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో కరోనా చాలా సంతోషంగా ఉంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఇదే సహకారాన్ని కరోనా కోరుకుంటోంది' అంటూ ఎద్దేవా చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: