టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా నందమూరి అభిమానులు అందులోనూ బాలయ్య అభిమానులు ఆయన సినిమా గురించి చేసే హడావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు వాళ్ళు చేసే సందడి అంతా ఇంతా కాదు అనేది వాస్తవం. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి గానూ రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బీ గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

అయితే ఆ సినిమా కాదు మరో సినిమా ఓకే అయింది అని సమాచారం. తాను పైసా వసూల్ సినిమా చేస్తున్న సమయంలో అప్పుడు పూరి జగన్నాథ్ కి ఆయన ఒక మాట ఇచ్చారు. సినిమా మళ్ళీ చెయ్యడానికి రెడీ గా ఉండు అని. దీనితో ఇప్పుడు పూరి రెడీ చేసిన  ఒక కథను ఆయన ఓకే చేసారు అని ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బాలకృష్ణ కలిసి నటించ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా కథను ఎప్పుడో రెడీ చేసి లాక్ డౌన్ లో వినిపించారు అని అంటున్నారు. 

 

దీని గురించి ఇప్పుడు చర్చలు  జరుగుతున్నాయి అని నటించడానికి కళ్యాణ్ రామ్ కూడా ముందుకు వచ్చారు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా ఓకే అవ్వకపోతే మాత్రం బాలకృష్ణ బీ గోపాల్ తో సినిమా చేస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: