వెండితెర అంటే అదో మోజు, ఎక్కడి వారు కూడా అక్కడకు చేరి తెరపైన తమను తాము చూసుకోవాలని, చిర కీర్తిని, అంతే విధంగా డబ్బుని గడించాలని ఆశపడతారు. అనామకులుగా వచ్చి వెండి తెర మీద బంగారు పంటలు పండించిన క్రుషీవలురు ఎంతో మంది ఉన్నారు. వెండి తెర అని ఎందుకు పేరు పెట్టారో కానీ అదెపుడూ వెన్నలలే కురిపిస్తూ తన ప్రస్తానం సాగించింది.

 

అయితే చాలా కాలంగా ఆ వెండికి కూడా మరకలు అంటుకుంటున్నాయి. ఆ వెన్నలలకు కూడా మబ్బులు పడుతున్నాయి. గట్టిగా చెప్పాలంటే గత రెండు దశాబ్దాలుగా చిత్ర సీమ నానా రకాలుగా సమస్యలతో అవస్థలు పడుతోంది. పెరిగిన సాంకేతిక సంపత్తి వెండి తెర జిలుగులను మసకబారుస్తోంది. 

 

అయితే ఇన్నిరకాల సవాళ్ళు ఎదురైనా  కూడా ఎప్పటికపుడు కొత్త ఆలోచనలతో సినిమా రంగం తన ఉనికిని చాటుకుంటోంది. తెలుగు సినిమా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటి వేల కోట్లను సంపదించగలదు అని నిరూపించింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం సమస్యలు తప్పడంలేదు. ఇవన్నీ ఇలా ఉండగానే ఇపుడు కరోనా మహమ్మారి వచ్చి సినిమా తెరను చించేసింది.

 

సినిమా హాళ్ళకు శాపంగా మారింది. రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని దుస్థితి ఏర్పడింది. సినిమా రంగం అంటేనే సమిష్టి క్రుషి. ఎక్కడ కెమెరా కళ్ళతో చూసి బొమ్మ తీస్తే ఆ బొమ్మ మన వూరి సినిమా హాలులో పడితేనే హిట్ అయినట్లు. ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి.

 

ఇదిలా ఉండగా పెద్ద సినిమా కధ ఎలా ఉంటుందోనన్న భయం ఇపుడు అందరికీ పట్టుకుంది. సినిమా గత వైభవమేనా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. జనాలు ఉంటేనే సినిమా. జనాలు ఉంటే వస్తుంది కరోనా. దాంతో కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేంతవరకూ సినిమా భవిష్యత్తు ఎవరూ చెప్పలేరు.

 

 ఈ లోగా ఎన్ని మార్పులు వస్తాయో... అసలు  సినిమా అన్న ఫార్మేట్ ఉంటుందో ఉండదో అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. మొత్తానికి సినిమా కధ కు శుభం కార్డు దగ్గరలో ఉందా అన్న బెంగ సినీ నిర్మాతలతో పాతు సినీ ప్రియులకూ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: