సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత విజయశాంతి బిజీ అవుతారు అని ఆమె ఫాన్స్ చాలా ఆశగా ఎదురు చూసారు గాని పని జరగలేదు. ఆమెకు వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని చాలా మంది ఎదురు చూసారు. అయినా సరే ఆమెకు మంచి ఆఫర్ అనేది రాలేదు. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడినా సరే ఆమెకు మాత్రం  అవకాశాలు ఇవ్వడానికి దర్శకులు ఎవరు ముందుకు రావడం లేదు. ఆమె ప్రస్తుతం ఏ సినిమా చేయకుండా దాదాపుగా ఖాళీ గానే ఉన్నారు. ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 

 

ఒకప్పుడు హీరోయిన్ గానే కాకుండా మంచి నటి గా కూడా ఆమెకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఒక కీలక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని టాక్ వినపడుతుంది. ఒక అగ్ర హీరో సినిమాకు ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు గానూ ఆమెను తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆమెకు ఒక మంచి పాత్ర దర్శకుడు ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు అని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పారు అని పెద్దగా డిమాండ్ కూడా చేయలేదు అని టాక్. 

 

ఆమెకు మంచి పాత్ర ఇచ్చే విషయంలో దర్శకుడు కొన్ని రోజులు గా కష్టపడుతున్నారు అని ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరిపిన తర్వాత ఆమెకు మంచి పాత్ర ఇచ్చారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథను దర్శకుడు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా  ఫస్ట్ లుక్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుంది ఆ ఫస్ట్ లుక్ అనేది చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి త్వరలో క్లారితి వస్తుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: