చిన్న చిన్న సినిమాలకు ఆదరణ ఉండాలి అనేది చాలా మంది నిర్మాతలు దర్శకులు చెప్పే మాట. చిన్న సినిమా ఒకటి విడుదల అవుతుంది అంటే దర్శక నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. చిన్న సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కొందరు. అలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో మన తెలుగులో చాలానే వస్తున్నాయి. ఏదోక రూపంలో ఏడాదికి ఒక వంద సినిమాలు వస్తుంటే అందులో చిన్న సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఉందని కోణాలు ఆ సినిమాల్లో ఉంటున్నాయి అనేది వాస్తవం. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు చిన్న సినిమాల మీద కొందరు హీరోలు దృష్టి పెట్టారు అని టాక్. రానా ఇప్పుడు చిన్న సినిమాలకు ఫైనాన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. చిన్న సినిమాలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని తాను వాటికి నిర్మాతగా వ్యవహరించాలి అని అనుకుంటున్నా అని తండ్రి కి కూడా చెప్పినట్టు సమాచారం. ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని సమాచారం. త్వరలోనే ఒక చిన్న సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినపడుతుంది. 

 

ఒక యువ హీరో ని కూడా పరిచయం చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. మంచి మంచి కథలు ఉంటే తన వద్దకు తీసుకుని రావాలి అని దర్శకులకు కూడా చెప్పారట. ముఖ్యంగా యువ దర్శకులు అయితే తాను కథను వేగంగా వింటా అని కూడా చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఒక విద్యార్ధి రాసిన కథను రానా విన్నాడు అని ఆయనకు అది బాగా నచ్చింది అని సమాచారం. ఆ కథను తీసుకుని తన తండ్రి వద్దకు కూడా వెళ్ళగా ఆయన కూడా అందుకు ఓకే చెప్పాడు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: