ఆలియాభట్ ఎంత అందంగా ఉంటుందో.. ఆమె మనసు అంతకంటే అందమైంది. ఆలియా నటనలోనే కాదు మంచి మనసులోనూ ఎవరెస్టే. అసలు కేరింగ్ లో ఆలియా భట్ ను మించినవాళ్లు లేరు. కపూర్ కందాన్ మొత్తం ఆలియా జపమే పఠిస్తోంది. 

 

ఆలియా భట్ అంటే ఆన్ స్క్రీన్ లో బెస్ట్ పెర్ఫామర్. ఆఫ్ స్క్రీన్ లో అల్లరి పిల్లగానే చాలామందికి తెలుసు. కానీ ఆలియా అంటే అందమైన అల్లరి పిల్ల మాత్రమే కాదు.. బాధ్యతలు తెలిసిన మహిళ అంటోంది కపూర్ ఫ్యామిలీ. కష్టకాలంలో రణ్ బీర్ కపూర్ వెంట నడుస్తోన్న ఆలియాకు కపూర్ కాందాన్ మొత్తం ఇంప్రెస్ అయిపోయింది. ఇంత మంచికోడలు మా పరివార్ లో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

రణ్ బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ చనిపోయినప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ దు:ఖంలో పాలుపంచుకుంటోంది ఆలియా. రణ్ బీర్ కు అతని తల్లి నీతూ కపూర్ కు మోరల్ సపోర్ట్ ఇస్తోంది. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటోంది. అందరినీ కో-ఆర్డినేట్ చేసుకుంటూ కపూర్ ఫ్యామిలీలో కలిసిపోయింది ఆలియా భట్. 

 

రణ్ బీర్ కపూర్ తండ్రి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వెళ్లినపుడు కూడా ఆలియా తోడుగా వెళ్లింది. రణ్ బీర్, నీతూ కపూర్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. రణ్ బీర్ కు ఇంత సపోర్ట్ గా నిలబడిన ఆలియాను చూసి కపూర్ కందాన్ పొంగిపోతోంది. రణ్ బీర్ లైఫ్ లోకి మంచి అమ్మాయి వస్తోందని మురిసిపోతున్నారు. ఇక రణ్ బీర్ ఆలియా రెండేళ్ల నుంచి లవ్ లో ఉన్నారు. మొత్తానికి కపూర్ కందాన్ ఆలియా భట్ పై ప్రశంసలు కురిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ కు ఆలియా సరైన జోడీ అని పొగడ్తలు కురిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ ఆవేదనలో భాగస్వామ్య మైందని అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: