ప్రస్తుతం మన దేశం మొత్తం కూడా కొన్ని వారాలుగా లాక్ డౌన్ చేయబడి ఉండడంతో అన్ని రంగాలు మూసివేయబడడం, అలానే ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో, ఈ పరిస్థితి ఎందరో దిగువ వర్గాల ప్రజలకు తిండి లేకుండా చేస్తోంది. రెక్కాడితేనే గాని డొక్కాడని ఎందరో పేదలు పనులు లేకపోవడంతో కుటుంబాలు పోషించలేక నానా అవస్థలు పడుతున్న స్థితిని గ్రహించి కేంద్రంతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి వారికి ఉచిత రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా ప్రకటించడం జరుగుతోంది. అయితే ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రజలను మేము కూడా ఆదుకుంటాం అంటూ ఎందరో ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. 

 

అలానే సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అనేకులు తమ మంచి మనసుతో విరాళాలు అందించడం జరిగింది. కాగా యువ నటుడు విజయ్ దేవరకొండ కూడా తన వంతుగా ఇటీవల రూ.1.30 కోట్ల విరాళం ప్రకటించడం తో పాటు మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి పలువురు నుండి విరాళాలు వసూలు చేసి వాటిని తిండి లేని వారికి నిత్యావసరాల రూపంలో అందిస్తూ తనవంతుగా చేయూతనిస్తున్నాడు. అయితే విజయ్ చేపట్టిన ఈ కార్యక్రమం పై ఒక ప్రముఖ వెబ్ సైట్ వారు తప్పుగా కథనాలు రాయడంతో కొంత మానసికంగా కృంగిపోయిన విజయ్, నిన్న ఒక వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్త పరుస్తూ, దయచేసి మీకు వ్యూస్ రావడం కోసం తప్పుడు వార్తలు రాయకండి, మా సంస్థ సభ్యులు నిరంతరం ఎంతో శ్రమపడి ఎందరికో సేవ చేస్తున్నారు. 

 

అలానే ఎంతో మంచి మనసున్న వారు మా సంస్థకు విరాళాలు అందిస్తున్నారు. మీరు రాస్తున్న ఈ తప్పుడు రాతల వలన అందరికి నష్టం జరుగుతుందని తన వీడియోలో విజయ్ తెల్పడం జరిగింది. కాగా ఇటువంటి ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ చిరంజీవి తో సహా నేడు కింగ్ అక్కినేని నాగార్జున కూడా విజయ్ కి తోడుగా ముందు వచ్చారు. చిరంజీవి గారు, మహేష్ బాబు సహా ఎందరో ప్రముఖులు విజయ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారని, అలానే తన పూర్తి సపోర్ట్ కూడా అతడికి ఉంటుందని, తప్పకుండా ఈ ఘటనపై చర్యలు తీసుకుందాం అంటూ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: