ప్రముఖ మోడల్, నటి అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముందుగా 1994లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో ఇండియా తరపున విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు మోడలింగ్ వృత్తిలో కొనసాగిన ఐశ్వర్యారాయ్, తొట్ట తొలిసారిగా 1997లో ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువార్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేయడం జరిగింది. అదే సినిమా తెలుగులో ఇద్దరు గా డబ్ కాబడింది. 

 

కాగా హీరోయిన్ గా నటించిన తొలి సినిమాతోనే అత్యద్భుత విజయాన్ని అందుకున్న ఐశ్వర్యారాయ్, ఆ తర్వాత నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక అప్పట్లో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ దాన్ని సక్సెస్ గా మలుచుకుంటూ విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన ఐశ్వర్యరాయ్, ప్రేక్షకుల గుండెల్లో అందాల భామగా గొప్ప పేరు గడించారు. అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా ఎవరైనా అమ్మాయి అందంగా ఉంది అంటే, ఆమె అందాన్ని ఐశ్వర్య రాయ్ తో మగవారు పోలుస్తూ ఉంటారు అంటే, దానిని బట్టి ఐశ్వర్య యొక్క అందం ఎటువంటితో అర్థం చేసుకోవచ్చు. 

 

ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు చెదిరే అందమే ఆమెకున్న గొప్ప ఐశ్వర్యం అని, బహుశా అందుకే ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఐశ్వర్యారాయ్ అని పేరు పెట్టారని ఇప్పటికీ కొందరు అభిమానులు సరదాగా అంటూ ఉంటారు. అయితే కేవలం అందగత్తెగా మాత్రమే కాక పలు సినిమాల్లో కూడా అద్భుతమైన నటనను కనబరిచి ఎందరో అభిమానులను సంపాదించ ఐశ్వర్యరాయ్, ఇటీవల అభిషేక్ బచ్చన్ వివాహమాడారు. ఇక వయసు పెరిగినప్పటికీ కూడా ఇప్పటికీ అదే విధమైన అందం మెయింటైన్ చేస్తున్న ఐశ్వర్యకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడక్కడా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తున్న ఐశ్వర్య, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికితే తెలుగు లో కూడా నటించడానికి సిద్ధం అని చెప్పారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి...!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: